AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డాక్టర్ బాబుకి మనమీద ప్రేమ లేదమ్మా’ !

ఇద్దరు పసి పిల్లల మనస్తత్వాలు, పెద్దల పంతాలు, పట్టింపుల మధ్య రసవత్తరంగా సాగిపోతోంది ‘కార్తీకదీపం’ సీరియల్. మధ్య మధ్య కన్నీళ్ల ఘట్టాలు, అక్కడక్కడ లైట్ హ్యూమర్ కూడా గురువారం నాటి ఎపిసోడ్ లో చూడవచ్చు..  శ్రావ్యకు పుట్టిన బిడ్డకు స్వెటర్ కొనేందుకు బయల్దేరిన తల్లి దీపతో బయల్దేరిన కూతురు శౌర్య.. తనకు, తాను  అన్నయ్యలా భావించే ఆటో డ్రైవర్ వారణాసికి ఓ రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా జరిగిన అనుభవం గురించి చెబుతుంది. ఆ ప్రమాదంలో వారణాసిపై చెయ్యి […]

'డాక్టర్ బాబుకి మనమీద ప్రేమ లేదమ్మా' !
Umakanth Rao
| Edited By: |

Updated on: Feb 06, 2020 | 3:34 PM

Share

ఇద్దరు పసి పిల్లల మనస్తత్వాలు, పెద్దల పంతాలు, పట్టింపుల మధ్య రసవత్తరంగా సాగిపోతోంది ‘కార్తీకదీపం’ సీరియల్. మధ్య మధ్య కన్నీళ్ల ఘట్టాలు, అక్కడక్కడ లైట్ హ్యూమర్ కూడా గురువారం నాటి ఎపిసోడ్ లో చూడవచ్చు..  శ్రావ్యకు పుట్టిన బిడ్డకు స్వెటర్ కొనేందుకు బయల్దేరిన తల్లి దీపతో బయల్దేరిన కూతురు శౌర్య.. తనకు, తాను  అన్నయ్యలా భావించే ఆటో డ్రైవర్ వారణాసికి ఓ రోడ్డు యాక్సిడెంట్ సందర్భంగా జరిగిన అనుభవం గురించి చెబుతుంది. ఆ ప్రమాదంలో వారణాసిపై చెయ్యి చేసుకున్న వ్యక్తిపై కార్తీక్ కోపంతో విరుచుకుపడడం, ఆ వ్యక్తిని కొట్టి కింద పడేయడం గురించి చెబితే.. దీపలో మెల్లగా ఆనందం మొదలవుతుంది. కార్తీక్ క్రమేపీ తమకు దగ్గర కావచ్ఛునని ఆశిస్తుంది. ఆమె కంట ఆనంద బాష్పాలు చూసిన శౌర్య మాత్రం.. అంత సంతోషపడకమ్మా.. అంటూ ఆమెను నిరాశకు గురి చేస్తుంది. ‘ఏమైంది అత్తమ్మా’ అని దీప ప్రశ్నించగా.. ఆ యాక్సిడెంట్ సమయంలో కార్తీక్ తనను దూరం పెట్టడం, దూరంగా వెళ్లడం గురించి చెబుతుంది. ‘ డాక్టర్ బాబుకి మనమీద ప్రేమ లేదమ్మా’ అని కన్నీటి పర్యంతమై చెప్పడంతో.. దీప మళ్ళీ ఆవేదనకు గురవుతుంది. ఇక..  శ్రావ్య, ఆమె  తల్లి భాగ్యం మధ్య నాలుగైదు నిముషాల మధ్య సాగిన వినోద ఘట్టం నవ్వు పుట్టిస్తుంది.

సీన్ మారితే.. దీప, శౌర్య.. స్వెటర్ కొనేందుకు షాపింగ్ మాల్ కి వస్తారు. స్వెటర్ కొనేందుకు బేరం ఆడుతున్నప్పుడే కార్తీక్, కూతురు హిమ కూడా అదే మాల్ కి వస్తారు. అక్కడ.. వారిని చూసిన దీప అక్కడినుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పటికీ.. శౌర్య వారించి.. కార్తీక్, హిమ ఉన్నచోటికి తీసుకువస్తుంది. దీప కొద్ధి  దూరంలో ఉండగా.. శౌర్య.. కార్తీక్, హిమ వద్దకు వస్తుంది. ఇద్దరూ తమకు నచ్చిన స్వెటర్లను ఎంచుకుంటారు. దీపను చూసిన కార్తీక్.. కాస్త దూరంగా వెళ్లి తన దుస్తుల సెలక్షన్ లో ఉన్నట్టు నటించడం, దీప అతడ్ని చూసీ చూడనట్టు నిలబడిపోవడంతో.. చివరకు.. ‘ ఇలా రా’ అని కార్తీక్ ఆమెను పిలవడం.. దీప అతని దగ్గరగా వఛ్చి.. ‘ ఇదేమిటి ? అందరూ చూస్తున్నారు.. అలా పిలుస్తారేం ‘ అని కొంటెగా అనడంతో కార్తీక్ విసుక్కోవడం సరదాగా సాగిపోయింది. తాము సెలక్ట్ చేసిన స్వెటర్లను వేర్వేరుగా సేల్స్ మన్ దగ్గరకు తీసుకువెళ్లిన శౌర్య.. దూరంగా నిలబడిన కార్తీక్ ను చూపిస్తూ.. ‘ఈ స్వెటర్లు వేర్వేరుగా ప్యాక్ చేయండి.. బిల్లు మాత్రం ఆ ఒక్కాయనకే ఇవ్వండి’ అనడం భలే ఇంటరెస్టింగ్ గా సాగింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో.. హిమ.. దీపను ‘వంటలక్కా’ అని పిలవబోయి.. ‘ పెద్దమ్మా’ అంటూ వఛ్చి ఆమెను హత్తుకోవడం హైలైట్ గా నిలవబోతోంది. హిమ ఇక తన తల్లి దీపే అని తెలుసుకోవడానికి ఆట్టే ఎపిసోడ్లు అవసరం కాకపోవచ్చు..