జీవీఎల్‌కి ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త కౌంటర్.. జగన్‌ను చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్రశ్న..!

ఏపీ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. ఇంకా దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. పార్లమెంట్ వేదికగా కేంద్రమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై అటు బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా స్పందించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా అభ్యంతరం మండిపడ్డారు. జీవీఎల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు. […]

జీవీఎల్‌కి ఆర్ఎస్ఎస్ సిద్ధాంత కర్త కౌంటర్.. జగన్‌ను చూస్తూ ఊరుకుంటారా అంటూ ప్రశ్న..!
Follow us

| Edited By:

Updated on: Feb 06, 2020 | 2:11 PM

ఏపీ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. ఇంకా దీనిపై చర్చ కొనసాగుతూనే ఉంది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. పార్లమెంట్ వేదికగా కేంద్రమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశంపై అటు బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా స్పందించారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త రతన్ శార్దా అభ్యంతరం మండిపడ్డారు. జీవీఎల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేశారు. రాజధానిపై జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలు సాంకేతికంగా సరైనవేనని అంటూనే.. మరోవైపు ఖండించారు. ఇప్పటి వరకు రాజధానిపై పెట్టిన వేల కోట్ల పెట్టుబడుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

రూ. వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతుంటే కేంద్రం పట్టించుకోదా..? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల మనోభావాలతో ఆడుకుంటారా అని జీవీఎల్‌ లక్ష్యంగా ఎదురు ప్రశ్నలు కురిపించారు. రైతుల భవిష్యత్‌తో జగన్‌ ఆడుకుంటుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా..? జగన్‌ విచిత్రమైన ఆలోచనలకు మద్దతు ఎలా ఇస్తారంటూ రతన్‌ శార్దా ట్వీట్‌ చేశారు. అటు ఏపీ బీజేపీ పరిస్థితిపైనా కూడా స్పందించారు. వనరుల దుర్వినియోగంపై పోరాడే పార్టీగా, మతమార్పిళ్లకు వ్యతిరేకంగా నిలిచే పార్టీగా ఏపీలోనూ బీజేపీ తనదైన శైలిలో వెళ్లాల్సిన అవసరముందుంటూ పేర్కొన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!