రాజధానిని తరలించొద్దంటూ.. కృష్ణా నదికి పూజలు

ఏపీలో అమరావతి వివాదం ఇంకా పూర్తిగా చల్లారలేదు. రాజధానిని అమరావతి నుంచి మార్చొద్దంటూ అక్కడి ప్రజలు చేస్తోన్న ఆందోళనలు ఇంకా పలు ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం వీరి ఉద్యమానికి 50 రోజులు పూర్తి అయ్యింది. ఇదిలా ఉంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అక్కడి మహిళలు కృష్ణా నదికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. తాళ్లాయపాలెం కృష్ణా నదిలో మందడం మహిళలు జల దీక్ష చేపట్టారు. కృష్ణా నదిలో కృష్ణమ్మకి సారె సమర్పించి మహిళలు పూజలు చేశారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:19 pm, Thu, 6 February 20