మహేశ్ స్టోరీతో పవన్ సినిమా.. ప్లాన్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.. ఈసారైనా కన్ఫార్మ్ కానుందా ?

రీఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలకు ఓకే చెబుతు ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తిచేసి.. ఇటివలే క్రిష్ డైరెక్షన్లో

మహేశ్ స్టోరీతో పవన్ సినిమా.. ప్లాన్ చేస్తున్న డైనమిక్ డైరెక్టర్.. ఈసారైనా కన్ఫార్మ్ కానుందా ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 26, 2021 | 2:21 PM

రీఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలకు ఓకే చెబుతు ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తిచేసి.. ఇటివలే క్రిష్ డైరెక్షన్లో చేయబోయే సినిమా షూటింగ్లో పాల్గోంటున్నాడు పవన్. తాజాగా ‘అయ్యప్పనం కోషియమ్’ సినిమా చిత్రీకరణ కూడా స్టార్ట్ చేశాడు పవన్. వీలైనన్ని వరకు వరుస ఆఫర్లకు ఓకే చెప్పేస్తూ.. మొత్తం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు జనసేనాని. ఈ సినిమాల తర్వాత పవన్ హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ మరో సినిమాను చేయబోతున్నాడు. ఇక ఇవి కాకుండా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ కథతో రానున్నట్లుగా సమాచారం.

డైనామిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. సూపర్ స్టార్ మహేష్ కాంబోలో ఓ మూవీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు జనగణమణ అనే టైటిల్‏ను ఫిక్స్ చేశారట. కానీ పదేళ్ళుగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఈ క్రమంలోనే మహేష్ ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఆ భారీ ప్రాజెక్ట్‏ను పూరీ మరో స్టార్ హీరోతో మాత్రమే తీయాలని ఫిక్స్ అయ్యాడట. ఇదిలా ఉండగా.. పూరీ ఈ స్టోరీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‏తో కలిసి ఈ సినిమాను రూపొందించాలని భావిస్తున్నాడట పూరీ. సాధ్యమైనంత తొందరగా పవన్‏తో ఈ స్టోరీకి ఒప్పించి.. వేగంగా ఈ మూవీని కంప్లీట్ చేయాలనుకుంటున్నట్లుగా సమాచారం. మరీ పవన్‏తో అయిన ఈ జనగణమణ సెట్స్ పైకి వెళ్లనుందా.. లేదా ? అనేది చూడాలి.