AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో హరిహర వీరమల్లు షూటింగ్‌ రీస్టార్ట్‌..

Pawan Kalyan: పవర్​స్టార్ పవన్​కల్యాణ్ (Pawan Kalyan) ​తొలిసారి పాన్‌ ఇండియా హీరోగా నటిస్తోన్న చిత్రం 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). వైవిధ్యమైన కథలతో అలరించే క్రిష్‌ జాగర్లమూడీ (Krish Jagarlamudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు

Hari Hara Veera Mallu: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో హరిహర వీరమల్లు షూటింగ్‌ రీస్టార్ట్‌..
Basha Shek
|

Updated on: Feb 07, 2022 | 7:36 AM

Share

Pawan Kalyan: పవర్​స్టార్ పవన్​కల్యాణ్ (Pawan Kalyan) ​తొలిసారి పాన్‌ ఇండియా హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). వైవిధ్యమైన కథలతో అలరించే క్రిష్‌ జాగర్లమూడీ (Krish Jagarlamudi) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తుండగా మరో పాత్రలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనువిందు చేయనుంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఏంఎం రత్నం చాలా రోజుల తర్వాత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ పీరియాడిక్‌ డ్రామాలో పవన్‌కల్యాణ్‌ వజ్రాల దొంగ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఓ టీజర్‌ పవర్‌స్టార్‌ అభిమానులను తెగ ఖుషీ చేసింది. ఇప్పటికే సుమారు 50 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితా తాజా విషయమేమిటంటే.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభం కానుందట.

స్టంట్ మాస్టర్ ఎవరంటే..

కాగా ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి స్టంట్ మాస్టర్‌గా షామ్ కౌషల్ పనిచేస్తున్నారు. ఆయన గతంలో క్రిష్‌, ధూమ్‌, దంగల్‌, బాజీరావ్‌ మస్తానీ వంటి హిట్ సినిమాలకు యాక్షన్‌ సీక్వెన్స్‌ను సమకూర్చారు. ఈ క్రమంలో భారీ యాక్షన్​సీన్లతోనే సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌ సీక్వెన్స్​కు సంబంధించిన స్క్రిప్ట్​ పనులను దర్శక నిర్మాతలు పవన్ తో చర్చించారని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ‘ హరి హర వీరమల్లు తదుపరి షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నాం. ఈ విషయమై డైరెక్టర్ క్రిష్ తో చర్చించాం. నాకు ఈ అవకాశం కల్పించిన పవన్ కల్యాణ్‌ సర్ కి, నిర్మాత ఏంఏం రత్నం గారికి ధన్యవాదాలు. ఆ దేవుని ఆశీస్సులు మా సినిమాపై చిత్రబృందంపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని షామ్ కౌషల్ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు.

Also Read:Odisha: ఒడిషాలో దారుణం.. మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి.. Hyderabad: భర్త షాపింగ్‌కు తీసుకెళ్లలేదని భార్య బలవన్మరణం.. తల్లి ప్రేమకు దూరమైన ఏడాదిన్నర చిన్నారి..

Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు..

Follow Us