AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Odisha: ఒడిషాలో దారుణం.. మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి..

ఒడిషా (Odisha) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా కలహండి జిల్లా (Kalahandi district) లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ జర్నలిస్ట్‌ మృతి చెందాడు

Odisha: ఒడిషాలో దారుణం.. మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి జర్నలిస్టు మృతి..
Representational Image
Basha Shek
|

Updated on: Feb 06, 2022 | 1:52 PM

Share

ఒడిషా (Odisha) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు, భద్రతా దళాలే లక్ష్యంగా కలహండి జిల్లా (Kalahandi district) లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఓ జర్నలిస్ట్‌ మృతి చెందాడు. కాగా కలహండిలో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటిని బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆయా గ్రామాల్లో పోస్టర్రలు, బ్యానర్లను ఏర్పాటుచేశారు. కాగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నుంచి ప్రచురితమయ్యే ఓ ప్రముఖ పత్రికలో జర్నలిస్టు, ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు రోహిత్ కుమార్ బిస్వాల్(46). ఈక్రమంలో మదన్‌పూర్‌ రాంపూర్‌ బ్లాక్‌లోని దోమ్‌కర్లకుంటా గ్రామం వద్ద ఓ చెట్టుకు మావోయిస్టులు అతికించిన పోస్టర్లు, బ్యానర్లను పరిశీలిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ పాతిపెట్టిన ఐఈడీ బాంబు పేలడంతో రోహిత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని ఎస్పీ వివేక్‌ తెలిపారు.

పోలీసులే లక్ష్యంగా..

కాగా పోలీసులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా మావోయిస్టులు ఈ బాంబులు అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా రోహిత్‌ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంతాపం ప్రకటించారు. రోహిత్‌కుమార్‌ కుటుంబానికి రూ.13 లక్షల నష్ట పరిహారం ప్రకటిస్తున్నట్లు సీఎం తెలిపారు . కాగా ఇలాంటి పోస్టర్లు, బ్యానర్లు కనిపించినప్పుడు పోలీసులు, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని బాంబు డిస్పోజబుల్ టీమ్స్‌ తో జల్లెడ పడతాయి. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టత వచ్చిన తర్వాతే ముందుకు వెళతారు. అయితే రోహిత్‌ విషయంలో ఇది జరగలేదు. భద్రతా దళాలు వెళ్లే లోపే రోహిత్‌ అక్కడకు చేరుకోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఒడిశా యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ సంఘం మావోయిస్టుల దుశ్చర్యను ఖండించింది. మావోల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో పని చేసే జర్నలిస్టులకు సరైన భద్రత కల్పించాలని కోరింది.

Also Read:ఈ మూడు పెద్ద బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. సేవింగ్ ఖాతా వడ్డీ రేట్లు మారాయి.. మారిన కొత్త రేట్లను ఇలా..

Health Tips: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి..!

Moto G Stylus: 50 మెగాపిక్సెల్‌తో మోటోరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!