ముందుగానే రానున్న పవన్‌-హరీష్‌ మూవీ..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం మూడు చిత్రాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అందులో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న వకీల్ సాబ్ ఒకటి కాగా.. ఈ మూవీకి సంబంధించి‌ ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది.

ముందుగానే రానున్న పవన్‌-హరీష్‌ మూవీ..!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ ప్రస్తుతం మూడు చిత్రాలకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అందులో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న వకీల్ సాబ్ ఒకటి కాగా.. ఈ మూవీకి సంబంధించి‌ ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా తరువాత క్రిష్ మూవీని పూర్తి  చేసి, ఆ తరువాత హరీష్‌తో సెట్స్ మీదకు వెళ్లాలనుకున్నారు పవన్. అయితే కరోనా రావడంతో పరిస్థితులు కాస్త మారిపోయాయి. ఈ క్రమంలో క్రిష్‌ మూవీకి బ్రేక్ పడ్డట్లు తెలుస్తోంది. ఈ మూవీని నిర్మిస్తోన్న ఏఎమ్‌ రత్నంకు ఆర్థిక సమస్యలు ఉండటంతో కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాలని ఆయన పవన్‌కి సూచించారట.

పరిస్థితులన్నీ సర్దుకున్నాక విరూపాక్షిని సెట్స్‌ మీదకు తీసుకెళ్తామని రత్నం, పవన్‌తో చెప్పారట. ఈ నేపథ్యంలో పవన్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే వకీల్‌ సాబ్‌కు సంబంధించి మిగిలి ఉన్న ఒక్క షెడ్యూల్‌ను పూర్తి చేసి, ఆ తరువాత హరీష్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడితో కూడా చెప్పినట్లు సమాచారం. ఇక ఈ మూవీ కోసం ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న హరీష్‌.. పవన్‌ నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu