AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘బింబిసార’, ‘కార్తికేయ2’ చిత్రాల ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు స్పందించిన జీ5

బింబిసార, కార్తికేయ2 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫిల్మ్ లవర్స్ ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. డేట్స్ చెప్పాలంటూ జీ5 టీమ్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tollywood:  ‘బింబిసార’, ‘కార్తికేయ2’ చిత్రాల ఓటీటీ విడుదలపై ఎట్టకేలకు స్పందించిన జీ5
Karthikeya 2 Bimbisara
Ram Naramaneni
|

Updated on: Sep 19, 2022 | 5:56 PM

Share

Karthikeya 2 OTT Release Date: సీతారామం సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ థియేటర్లలో చూడనివాళ్లు.. ఓటీటీలో చూసి థ్రిల్ అయ్యారు. ఇంత మంచి మూవీని థియేటర్లలో చూడనందుకు బాధపడ్డారు. ఇక ఈ సీజన్‌లోనే వచ్చిన ‘బింబిసార'(Bimbisara),  ‘కార్తికేయ2’(Karthikeya 2) మూవీస్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. చిన్న చిత్రాలుగా వచ్చి ఊహించని విజయాలు నమోదు చేశాయి.  వివిధ కారణాల వల్ల వీటిని థియేటర్స్‌లో చూడనివాళ్లు.. ఓటీటీ(OTT)లలో ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రాల హక్కులను జీ5(ZEE5) దక్కించుకుంది. సెప్టెంబర్ 23న బింబిసార, కార్తీకేయ 2 ను దసరా కానుకగా అక్టోబర్ 5న OTTలో రిలీజ్ అవుతాయని వార్తలు సర్కులేట్ అవుతున్నాయి. అయితే చిత్రాల విడుదలపై ఇంతవరకూ ఎలాంటి అధికారక ప్రకటన మాత్రం లేదు. ఈ క్రమంలోనే స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో చెప్పాలంటూ చాలామంది ఫిల్మ్ లవర్స్ జీ5 నిర్వాహకులను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎట్టకేలకు జీ5 నుంచి రిప్లై వచ్చింది. ‘మీ ఇంట్రస్ట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. దయచేసి కాస్త ఓపికపట్టండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం మా సోషల్‌ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వండి’ అని ఆన్సర్ ఇచ్చింది.

కొత్త కథలు చేయడానికి ఇష్టపడే కళ్యాణ్ రామ్ బింబిసార చిత్రంతో సరికొత్త ప్రయోగం చేసి విజయం అందుకున్నారు. ఇక శ్రీకృష్ణుడి ఇతివృత్తాంతంతో వచ్చిన ‘కార్తికేయ2’ అయితే సంచలన విజయం సాధించింది. నార్త్ ఆడియెన్స్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా రూ.100కోట్ల కలెక్షన్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కాగా మాకున్న సమాచారం మేరకు బింబిసార ఈ నెల 30 నుంచి, ‘కార్తికేయ2’ అక్టోబర్  5  నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి