OTT Movie: లేడీస్ హాస్టల్లో ఆ గదిలో ఏం జరుగుతుంది.. ? వెన్నులో వణుకుపుట్టించే స్టోరీ.. ఒంటరిగా చూస్తే ఇక అంతే..
వారాంతంలో ఇంట్లో హాయిగా కూర్చుని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ఆస్వాదించాలని సినీప్రియులు కోరుకుంటారు. అందుకే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఎక్కువగా హారర్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ విడుదలవుతున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి తెలిస్తే గుండెల్లో దడ పుట్టిస్తోంది.

ఒక దెయ్యం..అతీత శక్తులు అమ్మాయిలను వెంటాడి మరీ చంపేస్తుంటుంది. ఉద్యోగం కోసం వచ్చి హాస్టల్లో ఉండే అమ్మాయిల జీవితాలు మరింత దారుణంగా మారతాయి. ఈ దయ్యం హాస్టల్ లో ఉన్న ఏ అమ్మాయినీ బయటకు రానివ్వదు. మీరు ఈ సీరిస్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఒక ట్వి్స్ట్ ఉంటుంది. ఈ కథ ఢిల్లీలోని ఒక బాలికల హాస్టల్‌లో ప్రారంభమవుతుంది.గ్వాలియర్‌లో నివసించే మధు (మోనికా పన్వర్)కి చాలా బాధాకరమైన కథ ఉంటుంది. ఆ బాధను మర్చిపోవడానికి ఆమె ఉద్యోగం కోసం ఢిల్లీకి వస్తుంది. జాబ్ రావడంతో అక్కడే హాస్టల్ వెతుకుతుంది. చివరకు ఆమెకు ఒక హాస్టల్ దొరుకుతుుంది. అక్కడే అసలు కథ మొదలవుతుంది.
మధుకు హాస్టల్ గది నంబర్ 333 లభిస్తుంది. కానీ ఆ అంతస్తులో నివసించే అమ్మాయిలు ఆమెను వెళ్లిపోమని చెబుతారు. మొదట్లో, వారు ఏమి చెబుతున్నారో మధుకు అర్థం కాదు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా మధుకు ఆ గదిలో ఏదో శక్తి ఉందని అర్థమవుతుంది. నిజానికి మధు కంటే ముందు ఆ గదిలో ఉన్న ఓ అమ్మాయి ఆత్మ మొత్తం 333 మంది అమ్మాయిలను చంపేస్తుంది. అలాగే ఆ అంతస్తులో నివసించే అమ్మాయిలు హాస్టల్ వదిలి బయటకు వెళ్లలేకపోతారు. ఈ సిరీస్‌లో రజత్ కపూర్ డాక్టర్ పాత్రను పోషించారు. అతడు చివరకు మధుకు ఎలాంటి సహాయం చేస్తారు.. ? చివరకు మధు ఆ హాస్టల్ నుంచి బయటకు వచ్చిందా ? అనేది స్టోరీ.
ఈ సిరీస్ పేరు కౌఫ్. ఇందులో మోనికా పన్వర్, రజత్ కపూర్, చుమ్ దరాంగ్, శిల్పా శుక్లా, గగన్ అరోరా వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సిరీస్ ను స్మితా సింగ్ రచించగా.. పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సిరీస్ కు ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. అనుక్షణం ఈ సిరీస్ అడియన్స్ హృదయాల్లో వణుకు పుట్టిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..



