Mahaan Teaser: విక్రమ్‌ ‘మహాన్‌’ టీజర్‌ వచ్చేసింది.. తొలిసారి తనయుడితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న స్టార్‌ హీరో..

Mahaan Teaser: వైవిద్యభరితమైన చిత్రాలకు పెట్టింది పేరైన స్టార్‌ హీరో విక్రమ్‌ తాజాగా 'మహాన్‌' అనే సినిమాలో నటిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నారు ఫిబ్రవరి 10న ఈ సినిమా..

Mahaan Teaser: విక్రమ్‌ 'మహాన్‌' టీజర్‌ వచ్చేసింది.. తొలిసారి తనయుడితో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న స్టార్‌ హీరో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 31, 2022 | 4:01 PM

Mahaan Teaser: వైవిద్యభరితమైన చిత్రాలకు పెట్టింది పేరైన స్టార్‌ హీరో విక్రమ్‌ తాజాగా ‘మహాన్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదల చేయనున్నారు ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా తొలిసారి విక్రమ్‌ తన కుమారుడు ధృవ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నాడు. ధృవ్‌ కూడా మహాన్‌లో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఇక సినిమా తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. మద్యపాన నిషేధం నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. మద్యాన్ని నిషేధించాలంటూ కొంత మంది నిరసన చేస్తున్న సన్నివేశాలతో ప్రారంభమైన టీజర్‌ ఆసక్తిని పెంచింది. మద్యపానాన్ని నిషేధించే ఉద్యమం కోసం పోరాడుతూ గాంధీ మహాన్‌లా జీవిస్తానని హీరో తండ్రి చిన్న తనంలోనే తన నుంచి మాట తీసుకుంటాడు. అయితే విక్రమ్‌ పెద్దయ్యాక మద్యం సిండికేట్‌ను ఏలే ఒక డాన్‌గా మారినట్లు టీజర్‌లో చూపించారు.

‘ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు బార్‌ లీజ్‌ తీసుకున్నా.. తప్పకుండా మన సిండికేట్‌ మనిషై ఉండాలి. మనం పెట్టిందే చట్టం. మనం పోసేదే మద్యం’అని విక్రమ్‌ చెప్పే డైలాగ్‌ హీరో పాత్రపై క్లారిటీ ఇచ్చేసింది. మరి చిన్న తనంలో తండ్రికి మద్యపానాన్ని నిషేధించడానికి ఉద్యమిస్తానని మాటిచ్చిన హీరో పెద్దయ్యాక ఆ మద్యపాన సిండికేట్‌కు డాన్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందన్న విషయం తెలియాలంటే అమెజాన్‌ ప్రైమ్‌లో రానున్న ‘మహాన్‌’ను చూడాల్సిందే. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Heart Care: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ టీలు సూపర్‌.. అవేంటంటే..?

Parliament Budget Session: పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో ఇవే కీలకం.. ఈ 10 విషయాలలో తెలుసుకోండి..

BTech Jobs: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఖాళీలు.. అర్హతలు, జీతభత్యాలకు చెందిన వివరాలు ఇవే!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ