
ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ చిత్రాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ డ్రామా చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మూడేళ్ల క్రితం విడుదలైంది. ఆ మూవీ పేరు ది టీచర్. 2022లో రిలీజ్ అయిన ఈ మలయాళీ రివెంజ్ డ్రామాను ఇతర భాషలలోకి డబ్ చేయగా.. థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు వివేక్ దర్శకత్వం వహించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు.. ఆ తర్వాత బాధితులు ఎదుర్కోవడానికి పడిన మనోవేదన, ప్రతీకారం వంటి అంశాలను ఈ సినిమాలో చూపించారు. దాదాపు ఒక గంట 55 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఆద్యంతం థ్రిల్లర్ సినీప్రియులను ఎంటర్టైన్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.
ఇందులో అమలా పాల్ దేవిక అనే టీచర్ పాత్రలో నటించింది. అయితే స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్ సమయంలో ఆమె కొంతమంది విద్యార్థుల చేతిలో అత్యాచారానికి గురవుతుంది. ఆ తర్వాత ఆమె తీవ్రమైన మానసిక వేదనకు, భయానికి గురవుతుంది. అదే సమయంలో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. దీంతో తనకు జరిగిన విషయాన్ని దేవిక భర్తతో చెప్పడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ సమయంలో ఆమెకు తన అత్తయ్య అండగా నిలుస్తుంది. ఆ తర్వాత పోలీసుల సహయం లేకుండానే ఆ నలుగురు విద్యార్థులపై దేవిక ఎలా ప్రతికారం తీర్చుకుంది అనేది మిగతా స్టోరీ. ఈ సినిమాలో అమలా పాల్ యాక్టింగ్ అదరగొట్టింది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
ఈ మూవీకి IMDBలో 6.8 రేటింగ్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళంలో, హిందీలో అందుబాటులో ఉంది. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..