OTT Movies: విమానాల హైజాక్.. ఓటీటీల్లోని ఈ సూపర్ హిట్ సినిమాలను అసలు మిస్ కావొద్దు

ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోన్న 'IC 814 కాందహార్ హైజాక్' వెబ్ సిరీస్ వివాదాస్పదం అవుతోంది. 199లో జరిగిన IC 814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. దీనికి ముందు కూడా విమానాల హైజాక్ కు సంబంధించి పలు సినిమాలు, సిరీస్ లు తెరకెక్కాయి.

OTT Movies: విమానాల హైజాక్.. ఓటీటీల్లోని ఈ సూపర్ హిట్ సినిమాలను అసలు మిస్ కావొద్దు
Flight Hijack Based Movies
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2024 | 8:54 PM

విమానాల హైజాక్‌కి సంబంధించి సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే వచ్చాయి. ఇందులో ఎక్కువ భాగం యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించినవే. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘IC 814 కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదాస్పదం అవుతోంది. 199లో జరిగిన IC 814 కాందహార్ ఫ్లైట్ హైజాక్ స్టోరీ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. దీనికి ముందు కూడా విమానాల హైజాక్ కు సంబంధించి పలు సినిమాలు, సిరీస్ లు తెరకెక్కాయి. అవన్నీ ప్రస్తుతం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

‘IC 814 కాందహార్ హైజాక్’

1999 లో జరిగిన కాందహార్ హైజాక్ సంఘటనను ఆధారంగా చేసుకుని అనుభవ్ సిన్హా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు.అయితే తీవ్రవాదులకు హిందూ పేర్లను పెట్టడంతో ఈ సిరీస్ కాంట్రవర్సీ అయ్యింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ చూడొచ్చు.

‘బెల్ బాటమ్

అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటమ్ చిత్రం కూడా యదార్థ సంఘటనల ఆధారంగానే రూపొందింది. . 1980లో విమానం హైజాక్‌కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, లారా దత్తా, వాణి కపూర్, జైన్ ఖాన్ దురానీ, మోమితా మోయిత్రా ప్రధాన పాత్రలు పోషించారు. మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

నీర్జా

సోనమ్ కపూర్ నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా. నీర్జా. ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ హోస్టెస్ నీర్జా భానోత్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. 1986లో, కరాచీ నుండి పాన్ యామ్ ఫ్లైట్ 73లో 359 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఆమె తన ప్రాణాలను అర్పించారు. ఈ చిత్రంలో సోనమ్ కపూర్, షబానా అజ్మీ, యోగేంద్ర టికె, శేఖర్ రవిజాని నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడవచ్చు.

‘హైజాక్’

2008లో విడుదలైన ‘హైజాక్’ చిత్రంలో షైనీ అహుజా, ఈషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. కృనాల్ శివదాసాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ ఆధారంగా రూపొందించబడింది. దుబాయ్‌లో ఓ విమానాన్ని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మీరు ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

వీటితో పాటు అక్కినేని నాగర్జున నటించిన గగనం, విద్యుత్ జమ్వాల్ ఐబీ 71, యామీ గౌతమ్ చోర్ నిఖలే కా భాగా, సిద్ధార్థ్ మల్హోత్రా యోధా, అజయ్ దేవ్ గణ్, అభిషేక్ బచ్చన్ ల జమీన్ సినిమాలు కూడా విమానాల హైజాక్ కు సంబంధించిన కథలతోనే తెరకెక్కినవే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!