The Railway Men Teaser: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రియల్ స్టోరీ.. ఆకట్టుకుంటున్న టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ 'ది రైల్వే మెన్'. ఇందులో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. ఈ సిరీస్‌లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో కనిపించనున్నారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్‌గా, బాబిల్ లోకో పైలట్‌గా నటిస్తున్నారు.

The Railway Men Teaser: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రియల్ స్టోరీ.. ఆకట్టుకుంటున్న టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
The Railway Men
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 29, 2023 | 6:30 AM

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను, వెబ్ సిరీస్‏లోను తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అటు థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు రన్ అవుతున్నా.. ఓటీటీలకు ఆదరణం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా ఆ సిరీస్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’. ఇందులో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. ఈ సిరీస్‌లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో కనిపించనున్నారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్‌గా, బాబిల్ లోకో పైలట్‌గా నటిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి నలుగురూ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది.

దీపావళి సందర్భంగా ఈ 4-భాగాల సిరీస్ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి నూతన దర్శకుడు శివ్ రావైల్ దర్శకత్వం వహించగా, ఆయుష్ గుప్తా కథను అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను 2021లో ప్రకటించగా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..

1984లో, డిసెంబర్ 2-3 రాత్రి, భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విష వాయువు లీక్ అయింది. కర్మాగారంలోని ప్లాంట్ నెం. ‘సి’లో, టాక్సిక్ మిథైల్ ఐసోసైనైడ్ వాయువు ట్యాంక్ నంబర్ 610లో కలపడం ప్రారంభమైంది. రసాయన ప్రతిచర్య ఒత్తిడిలో ట్యాంక్‌ తెరుచుకుని విషపూరిత వాయువు గాలిలో కలిసిపోవడం ప్రారంభించింది. ఈ ప్రమాదంలో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఈ విష వాయువు ప్రభావాలను అనుభవిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!