The Great indian Suicide: ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ సినిమా ఒక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
దీనికి విప్లన్ కోనేటి దర్శకత్వం వహిస్తూనే.. సిరంజ్ సినిమా, కేఎస్వీ ప్రెజెంట్స్ బ్యానర్లపై విప్లవ్ కోనేటి నిర్మిస్తున్నారు. ఏపీలోని మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించింది చిత్రయూనిట్.

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్, నరేష్ వీకే, పవిత్రా లోకేషన్, జయ ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’. దీనికి విప్లన్ కోనేటి దర్శకత్వం వహిస్తూనే.. సిరంజ్ సినిమా, కేఎస్వీ ప్రెజెంట్స్ బ్యానర్లపై విప్లవ్ కోనేటి నిర్మిస్తున్నారు. ఏపీలోని మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. బుధవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం అక్టోబర్ 6 నుంచి తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించింది చిత్రయూనిట్.
డైరెక్టర్ విప్లవ్ కోనేటి మాట్లాడుతూ.. “సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్‌కు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. నరేష్ గారు తక్కువ సీన్స్ చేసిన ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ గారి క్యారెక్టర్ చూస్తే బయట ఇలాంటి లేడీస్ ఉంటారా అనిపిస్తుంది. నన్ను నమ్మండి మీరొక డిఫరెంట్ హెబ్బాను చూస్తారు ఈ సినిమాతో. హీరో రామ్ కార్తీక్ ను మిగతా వాళ్ళు తనని డామినేట్ చెయ్యకుండా, తనని తానూ ప్రూవ్ చేసుకున్నాడు” అని అన్నారు.
View this post on Instagram
ఇక ఆ తర్వాత హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడుతూ..” రెండు రోజుల్లో ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా సినిమాను చూడండి. ” అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ..”ముందుగా మీడియాకు థాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, ఈ మూవీను ఈ జోనర్ అని ప్రత్యేకంగా చెప్పలేను. కానీ ఈ సినిమా మీకు మంచి థ్రిల్ ఇస్తుంది” అని అన్నారు.
View this post on Instagram
చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం ఏంటీ ?.. ఏ మూఢనమ్మకం వారిని ఆత్మహత్యకు పురిగొల్పింది ?.. అనేది తెలియాలంటే ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా ఆహాలో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓదేలు రైల్వేస్టేషన్ తర్వాత హెబ్బా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓటీటీ చిత్రం ఇదే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








