Hebah Patel: యాంకర్ ప్రశ్నకు హర్ట్ అయిన హీరోయిన్.. ఇంటర్వ్యూ మధ్యలో నుంచి వెళ్లిపోయిన హెబ్బా..
చాలా కాలం తర్వాత హీరో నిఖిల్ సరసన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి హిట్ అందుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలతో థియేటర్లలో సందడి చేసినా స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ బ్యూటీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టింది. ఇందులో హెబ్బా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఓటీటీలో బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ హెబ్బా పటేల్. యంగ్ హీరో రాజ్ తరుణ్ జోడిగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో హెబ్బా పటేల్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. చాలా కాలం తర్వాత హీరో నిఖిల్ సరసన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరోసారి హిట్ అందుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న చిత్రాలతో థియేటర్లలో సందడి చేసినా స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అలరించిన ఈ బ్యూటీ ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో డిజిటల్ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టింది. ఇందులో హెబ్బా నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
దీంతో ఓటీటీలో బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సిరీస్ తో రాబోతుంది. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో అక్టోబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ సిరీస్ ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ యూట్యూబర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
అయితే ఇంటర్వ్యూలో మొదట్లోనే సదరు యాంకర్.. మూడు బాగుందా ? అంతా ఓకేనా? అంటూ అడగడంతో హెబ్బాకు అర్థం కాలేదని తెలిపింది. దీంతో మరోసారి మూడు బాగుందా ? అంతా ఓకేనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ? అని అడగడంతో హెబ్బా హర్ట్ అయ్యి మధ్యలోనే వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఇదంతా ఫ్రాంక్ అంటూ కామెంట్స్ చేస్తున్నాయి.
This is real video and prank kaadhu ! Actually this is the first interview and next is mine akkade unna ! . Literally shocked 🚶🚶 https://t.co/KrTyPC8TpK
— Anchor_Karthik (@Karthikk_7) October 3, 2023
అయితే ఈ ఘటన నిజంగానే జరిగినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రాంక్ కోసమే ఇలా చేసి ఉంటారని.. లేదంటే వీడియో ఎందుకు బయటకు వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించారు. ఇందులో నరేష్ వీకే, పవిత్రా లోకేష్, జయప్రకాష్ కీలకపాత్రలలో నటించారు. చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం.. వారంతా ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు ? అనే అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ మరింత క్యూరియాసిటిని కలిగించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








