Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mansion 24 Trailer: వెబ్ సిరీస్‏తో భయపెట్టేస్తోన్న ఓంకార్ అన్నయ్య.. ఆసక్తికరంగా ‘మ్యాన్షన్ 24’ ట్రైలర్..

యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. ఆ తర్వాత వెండితెరపై దర్శకుడిగా మెప్పించాడు. జీనియర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఓంకార్.. ఆ తర్వాత రాజు గారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో నవ్విస్తూనే ప్రేక్షకులను భయపెట్టారు. ఆ తర్వాత సమంత, నాగార్జున ప్రధాన పాత్రలతో రాజు గారి గది 2 సినిమా తీసి మరో హిట్ అందుకున్నారు. దీంతో ఓంకార్ సినిమాలపై ప్రేక్షకులలో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

Mansion 24 Trailer: వెబ్ సిరీస్‏తో భయపెట్టేస్తోన్న ఓంకార్ అన్నయ్య.. ఆసక్తికరంగా 'మ్యాన్షన్ 24' ట్రైలర్..
Mansion 24 Trailer
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2023 | 2:31 PM

యాంకర్ ఓంకార్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టీవీలో మయాద్వీపం, ఆట, వంటి షోలతో అడియన్స్‏ను అలరించాడు. పిల్లలు, పెద్దలలో ఓంకార్‏కు ఫాలోయింగ్ ఉంది. ఓంకార్ అన్నయ్య అంటూ పిలుచుకుంటారు అభిమానులు. యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్.. ఆ తర్వాత వెండితెరపై దర్శకుడిగా మెప్పించాడు. జీనియర్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఓంకార్.. ఆ తర్వాత రాజు గారి గది సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో నవ్విస్తూనే ప్రేక్షకులను భయపెట్టారు. ఆ తర్వాత సమంత, నాగార్జున ప్రధాన పాత్రలతో రాజు గారి గది 2 సినిమా తీసి మరో హిట్ అందుకున్నారు. దీంతో ఓంకార్ సినిమాలపై ప్రేక్షకులలో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.

రాజు గారి గది 2 తర్వాత 2019లో రాజు గారి గది 3తో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు మ్యాన్షన్ 24 సినిమాతో డిజిటల్ ప్లాట్ ఫాంపై భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఓంకార్ తెరకెక్కిస్తోన్న ఈ వెబ్ సిరీస్ లో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించాయి. ఇక బుధవారం విడుదలైన ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

‘జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు’ అన్న హెడ్ లైన్ తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. తాను దేశద్రేహి కూతుర్ని కాదని.. నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని అని నిరూపిస్తానంటూ సీన్ లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్ కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు పోరాడుతుంది వరలక్ష్మి. తండ్రి కోసం వెతుకుతూ పాడుబడ్డ మ్యాన్షన్ లోకి అడుగుపెడుతుంది. అక్కడ ఆమె ఎదుర్కోన్న పరిస్థితు ఏంటీ ?.. చివరకు తన తండ్రి గురించి ఎలాంటి నిజాలు తెలుసుకుంది అనేది తెలియాలంటే మ్యాన్షన్ 24 సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.