Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mathu Vadalara 2 OTT: కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీనా? మరికొన్ని గంటల్లో ఓటీటీలో మత్తు వదలరా 2.. ఎక్కడ చూడొచ్చంటే?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా, స్టార్ క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా ఇదికి సీక్వెల్. రితేశ్ రానా తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా మరో లీడ్‌ రోల్‌లో న‌టించింది.

Mathu Vadalara 2 OTT: కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీనా? మరికొన్ని గంటల్లో ఓటీటీలో మత్తు వదలరా 2.. ఎక్కడ చూడొచ్చంటే?
Mathu Vadalara 2 Movie
Basha Shek
|

Updated on: Oct 10, 2024 | 8:41 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా, స్టార్ క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం ‘మ‌త్తు వ‌ద‌ల‌రా 2’. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా ఇదికి సీక్వెల్. రితేశ్ రానా తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా మరో లీడ్‌ రోల్‌లో న‌టించింది. సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్ గా నిలిచింది. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నామన్నారు. ముఖ్యంగా సినిమాలో సత్య కామెడీ అదిరిపోయిందని ప్రశంసలు కురిపించారు. అలాగే శ్రీ సింహా, వెన్నెల కిశోర్, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ ల నటన కూడా బాగుందని పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇలా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా 2 మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మత్తు వదలరా 2 మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్ వచ్చింది. శుక్రవారం (అక్టోబర్ 11) నుంచే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఇంకా అధికారిక ప్రకటన ఇంకా చేయకపోయినా, సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ పై మత్తు వదలరా 2 అని సెర్చ్ చేస్తే శుక్రవారం స్ట్రీమింగ్ కు వస్తోందని తెలిపింది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్న మాట. ఈ దసరా పండుగకు ఓటీటీలో నవ్వుల జల్లులు కురుస్తున్నాయన్నమాట.

క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు సంయుక్తంగా మత్తు వదలరా 2 సినిమాను నిర్మించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఓవరాల్ గా రూ. 35 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిందని సమాచారం. మరి థియేటర్లలో మత్తు వదలరా 2 సినిమాను మిస్ అయ్యారా? అయితే మరికొన్ని గంటలు వెయిట్ చేయండి. దసరా పండగకు ఎంచెక్కా ఇంట్లోనే ఈ మూవీని చూసి కడుపుబ్బా నవ్వుకోండి.

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మత్తు వదలరా 2 ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.