AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Squid Game The Challenge OTT: ఓటీటీలోకి వచ్చేసిన స్క్విడ్ గేమ్ 2 .. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

స్వ్కిడ్‌ గేమ్‌ చివర్లోనే దీనికి కొనసాగింపు ఉంటుందని మేకర్స్‌ హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే రెండో సీజన్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. స్క్విడ్‌ గేమ్‌ 2 ది ఛాలెంజ్‌ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మోస్ట్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌ ఓటీటీలోకి వచ్చేసింది

Squid Game The Challenge OTT: ఓటీటీలోకి వచ్చేసిన స్క్విడ్ గేమ్ 2 .. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Squid Game The Challenge
Basha Shek
|

Updated on: Nov 22, 2023 | 6:02 PM

Share

స్క్విడ్ గేమ్.. ఓటీటీలో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు బాగా చూసే వారికి స్క్విడ్ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌ మోస్ట్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌గా స్క్విడ్ గేమ్‌ ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుంది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, మనీ హెయిస్ట్‌, స్ట్రేంజర్‌ థింగ్స్‌ వంటి టాప్‌ వెబ్‌ సిరీస్‌లను సైతం వెనక్కునెట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అయిన స్వ్కిడ్‌ గేమ్‌ను కేవలం 28 రోజుల్లోనే 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు చూశారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ వెబ్‌ సిరీస్‌ ఎంతలా నచ్చిందో. ఇక అంతర్జాతీయంగా పలు అవార్డులను కూడా స్క్విడ్ గేమ్ గెల్చుకుంది. ప్రతిష్టాత్మక ఎమ్మీ పురస్కారాల్లో 14 విభాగాల్లో నామినేట్‌ అయిన స్క్విడ్ గేమ్ ఏకంగా ఆరు పురస్కారాలు సొంతం చేసుకోవడం విశేషం. కాగా స్వ్కిడ్‌ గేమ్‌ చివర్లోనే దీనికి కొనసాగింపు ఉంటుందని మేకర్స్‌ హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే రెండో సీజన్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ ఓ రేంజ్‌లో హిట్‌ అయ్యాయి. స్క్విడ్‌ గేమ్‌ 2 ది ఛాలెంజ్‌ సిరీస్‌పై మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మోస్ట్‌ పాపులర్‌ వెబ్‌ సిరీస్‌ సీక్వెల్‌ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్ప‌టికే సెకండ్ సీజన్‌కు సంబంధించి ఫ‌స్ట్ లుక్‌తో పాటు ట్రైల‌ర్‌లు విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సెకండ్ సీజ‌న్ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ‘స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్’ స్ట్రీమింగ్ అవుతుంది. స్క్విడ్ గేమ్‍ వెబ్‌ సిరీస్‌కు హ్వాంగ్ డాంగ్ హ్యుక్ తెరకెక్కించారు. మొదటి పార్ట్‌లో కనిపించిన లీ జంగ్ జే, లీ బ్యుంగ్ హున్, వి హా జున్, గాంగ్ యూ… రెండో సీజన్‌లో కూడా నటించనున్నారు. వీరితో మరికొంతమంది నటీనటులు రెండో సీజన్‌లో భాగం కానున్నారు. ఇక సెకండ్ సీజ‌న్‌లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది ఈ డేంజరస్‌ గేమ్‌ లో పోటీ పడనున్నారు. మరి ఈ వీకెండ్‌ మంచి వెబ్‌ సిరీస్‌ చూడాలనుకునే వారికి స్వ్కిడ్‌ గేమ్‌ 2 మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

 తెలుగులోనూ అందుబాటులో..

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us