AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: సాంగ్ కాదు.. అబ్బాయిల మనసులోని బాధ.. 2012లో యూత్‏ను ఊపేసిన లవ్ ఫెయిల్యూర్ పాట..

లవ్ ఫెయిల్యూర్ పాటలకు సెపరేట్ వైబ్ ఉంటుంది. సంవత్సరాలు గడిచిన ఆ పాటలకు ఉండే క్రేజ్.. ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గదు. ఇక లిరిక్స్ గురించి చెప్పక్కర్లేదు. కొన్ని సాంగ్స్ ప్రతి శ్రోత హృదయాన్ని తాకుతాయి. అలాంటి పాటలలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఒకటి. 2012లో యూత్‏ను ఊపేసిన ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఏంటో తెలుసుకుందామా.

Trending Song: సాంగ్ కాదు.. అబ్బాయిల మనసులోని బాధ.. 2012లో యూత్‏ను ఊపేసిన లవ్ ఫెయిల్యూర్ పాట..
Vellipove Vellipove Song
Rajitha Chanti
|

Updated on: Nov 16, 2026 | 5:05 PM

Share

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని పాటలు విడుదలైన కొత్తలోనే కాకుండా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటాయి. ముఖ్యంగా ప్రేమలో విఫలమైన కుర్రాళ్ల బాధను తెలియజేసే సాంగ్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందిందే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్. నిజానికి అది పాట కాదు. ప్రేమించిన అమ్మాయిని కోల్పోయిన ప్రతి అబ్బాయి మనసులోని వేదన అని చెప్పొచ్చు. అదే ‘మేం వయసుకి వచ్చాం’ చిత్రంలోని “వెళ్ళిపోవెళ్ళిపోవే..” సాంగ్. 2012 సంవత్సరంలో విడుదలైన ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్, అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి మొబైల్ రింగ్‌టోన్‌గా మారిపోయింది. అబ్బాయిలు తెగ పాడుకునేవారు. ఇప్పటికీ ఈ పాటకు ఉండే క్రేజ్, వైబ్ మాత్రం తగ్గడం లేదు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

తనీష్, నీతి టేలర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘మేం వయసుకి వచ్చాం’ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని “వెళ్ళిపోవెళ్ళిపో..” పాట సినిమాకే ఒక మేజర్ హైలైట్‌గా నిలిచింది. ప్రేమించిన వ్యక్తి దూరమైనప్పుడు కలిగే తీవ్రమైన వేదన, గుండె బరువెక్కిన క్షణాల్లో వచ్చే కన్నీళ్లు, ఆ జ్ఞాపకాలను మరవలేక సతమతమయ్యే ఒక ప్రేమికుడి అంతరంగ ఆవేదనను ఈ పాటలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అందుకే అప్పట్లో ఈ పాట సెన్సేషన్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..

ఈ పాటకు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ కట్టిపడేసింది. అలాగే సింగర్ రంజిత్ వాయిస్, ఎమోషనల్ బిట్స్ కుర్రాళ్లను కంటతడి పెట్టించాయి. లవ్ ఫెయిల్యూర్ మూడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ జీవితానికి ఈ పాటను ముడిపెట్టుకుని వినేవారు. కాలం ఎంత మారినా, ఎన్ని కొత్త పాటలు వచ్చినా బ్రేకప్ సాంగ్స్ అనగానే టక్కున గుర్తువచ్చే క్లాసిక్ మెలోడీస్‌లో ఇది ఒకటిగా నిలిచింది. ఇటు సోషల్ మీడియా రీల్స్ రూపంలోనూ, అటు యూట్యూబ్‌లోనూ ఈ పాట ఇప్పటికీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో తన హవాను కొనసాగిస్తూనే ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..

వెళ్లిపోవే సాంగ్..

ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..

Follow Us