టాటా మోటార్స్ నయా రికార్డ్.. 10 మాసాల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన మోడల్స్ ఇవే
ప్రముఖ దిగ్గజ సంస్థ "టాటా" మోటార్స్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. ఇప్పటికే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ కంపెనీ 2026 అమ్మకాల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 పూర్తి ఏడాది అమ్మకాలను.. ఈ ఏడాదిలో మరో రెండు నెలలు మిగిలి ఉండగానే అధిగమించింది. దీంతో ఈ వ్యవహారం బిజినెస్ సర్కిల్స్‌లో ఫుల్ ట్రెండింగ్‌గా మారింది.

ప్రముఖ దిగ్గజ సంస్థ “టాటా” మోటార్స్ నయా రికార్డ్ సృష్టించింది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ కంపెనీ 2026 అమ్మకాల్లో అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మొదటి 10 నెలల్లోనే.. 2025 పూర్తి ఏడాది అమ్మకాలను బీట్ చేసి బిజినెస్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
2025 ఏడాదిలో టాటా మోటార్స్ 5,78,772 యూనిట్లను విక్రయించింది. కానీ ఈసారి మాత్రం జనవరి నుంచి అక్టోబర్ వరకు 6,49,477 ప్యాసింజర్ వాహనాలను అమ్మేసింది. మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్ మంచి వృద్ధిని సాధించడం గమనార్హం. 2026 జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,24,792 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. ఈ లెక్కన చూస్తే టాటా విక్రయిస్తున్న ప్రతి ఐదు కార్లలో దాదాపు ఒకటి ఎలక్ట్రిక్ కారు కావడం విశేషం.
కాగా 2026 జనవరిలో 70,222 వాహనాలను సేల్ చేసిన టాటా.. ఫిబ్రవరిలో 62,329 యూనిట్లను అమ్మగలిగింది. మార్చిలో 66,192 యూనిట్లు, ఏప్రిల్‌లో 59,000 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ రకంగానే ప్రతినెలా అమ్మకాలు పెంచుకుంటూ రాగా.. సెప్టెంబర్ చివరి నాటికి 5,75,583 వాహనాలను విక్రయించింది. 2025 పూర్తి ఏడాది అమ్మకాల రికార్డును అధిగమించడానికి మరో 3,189 యూనిట్లు మాత్రమే అవసరమయ్యాయి. ఇక 2026 అక్టోబర్‌లో ఏకంగా 73,894 వాహనాలను విక్రయించడంతో ఆ రికార్డును సులభంగా అధిగమించింది.
మరోవైపు 2026 ముగియడానికి మరో రెండు నెలలు మిగిలి ఉన్న విషయం తెలిసిందే. దాంతో ఈ ఏడాది మొత్తం 7 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాల మైలురాయిని చేరుకోవాలంటే టాటా మరో 50,523 యూనిట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అదే 8 లక్షల మార్కును అందుకోవాలంటే నవంబర్, డిసెంబర్ నెలల్లో కలిపి ఏకంగా 1,50,523 వాహనాలు అమ్మకాలు చేయాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మోడళ్ల వారీగా టాప్ సేల్స్.. ( జనవరి నుంచి అక్టోబర్ 2026 వరకు )
1. టాటా పంచ్ – 2,02,794 యూనిట్లు 2. నెక్సాన్ – 1,96,490 యూనిట్లు 3. టియాగో – 70,555 యూనిట్లు 4. సియెర్రా – 69,779 యూనిట్లు
