AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yamuna Pollution: విషపు నురగలో ప్రకృతి పండగ.. యమునలో నదిలో ఇది పరిస్థితి

ఈ కింద కనిపిస్తున్న ఫోటో చూసి అదేదో పాల సముద్రం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు.. అది యమునా నది.. మరీ ఆ నదిలో ఆ తెల్లటి పాదార్థం ఏమిటి అనుకుంటున్నారా?.. అదంతా రసాయనాల వల్ల కాలుష్యమైన నది నుంచి వెలువడే నురగ.. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నదిలో ఇది పరిస్థితి.. ఈ విషపు నురగ మధ్యే ఇప్పుడు ప్రకృతి పండుగైన ఛత్ పూజను నిర్వహిస్తున్నారు భక్తులు. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Yamuna Pollution: విషపు నురగలో ప్రకృతి పండగ.. యమునలో నదిలో ఇది పరిస్థితి
Yamuna Pollution
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 16, 2026 | 4:28 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది కాలుష్యం మరోసారి తీవ్ర ఆందోళనకర స్థాయికి చేరింది. నదిలో పేరుకుపోయిన దట్టమైన విషపు నురగ మధ్యే భక్తులు ప్రకృతి పండుగైన ఛత్ పూజను జరుపుకున్నారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు కలిసిపోయి నది నీరు పూర్తిగా కాలుష్య మయమైనప్పటికీ, లక్షలాది మంది భక్తులు సంప్రదాయాన్ని వీడలేక అదే కాలుష్య నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. ప్రభుత్వం నదిలో యాంటీ-ఫోమింగ్ రసాయనాలను చల్లడం, కృత్రిమ ఘాట్లను ఏర్పాటు చేయడం వంటి తాత్కాలిక చర్యలు చేపట్టినప్పటికీ, యమునా నది ప్రక్షాళనకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

యమునా కాలుష్యానికి కారణాలు

యమునా నదిలో ఏటా ఈ రకమైన విషపు నురగలు ఏర్పడటానికి ప్రధానంగా శుద్ధి చేయని గృహ మురుగునీరు, చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన వ్యర్థాలే కారణం. ఇళ్లలో వాడే డిటర్జెంట్లు, ఫాస్ఫేట్లు, సర్ఫాక్టెంట్లు నదిలో చేరి నీటిని నురగలా మారుస్తున్నాయి. వర్షాకాలం ముగిసిన తర్వాత నదిలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడం, ఓఖ్లా బ్యారేజీ వద్ద నీరు కిందకు పడేటప్పుడు ఈ రసాయనాలు చిలకబడి దట్టమైన తెల్లటి నురగగా మారుతుంది.

ఆరోగ్యానికి ముప్పు

ఛత్ పూజలో భాగంగా భక్తులు నది నీటిలో నడుము లోతు వరకు దిగి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ విషపు నురగలో అమ్మోనియా, భారలోహాలు, ప్రమాదకర రసాయనాలు అధిక మోతాదులో ఉంటాయి. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ సంబంధిత అలెర్జీలు, కళ్ల మంటలు, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఛత్ పండుగ విశిష్టత

ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగల్లో ఛత్ పండుగ ఒకటి. ప్రకృతికి, సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలిపే ఈ వేడుక అత్యంత కఠినమైన నియమాలతో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు నహాయ్ ఖాయ్ భక్తులు పవిత్ర స్నానం ఆచరించి, సొరకాయ కూర, అన్నంతో కూడిన సాత్విక భోజనాన్ని స్వీకరిస్తారు. రెండో రోజు ఖర్నా ఈ రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం బెల్లం పాయసం రసియావ్ నైవేద్యం సమర్పిస్తారు.

ఇక్కడి నుంచే 36 గంటల నిర్జల ఉపవాసం ప్రారంభమవుతుంది. మూడో రోజు సంధ్యా అర్ఘ్యం సాయంత్రం వేళ వెదురు బుట్టలలో పండ్లు, ఠేకువా ప్రసాదంతో నది ఒడ్డుకు చేరుకుని, అస్తమించే సూర్యుడికి అర్ఘ్యమిస్తారు. నాలుగో రోజు ఉషా అర్ఘ్యం ఉటుంది. ఆ రోజు తెల్లవారుజామున నది నీటిలో నిలబడి ఉదయించే సూర్యుడికి నమస్కరించి, ప్రసాదం స్వీకరించి ఉపవాసం విరమిస్తారు. దీంతో చత్‌ పూజ ముగుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us