AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సీరియల్స్‌ చూసి దెయ్యాలుగా మారే భార్యలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్

మే 9న థియేటర్లలో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ తెలుగు ఆడియెన్స్ ను బాగానే అలరించింది. ఆకట్టుకునే కథా, కథనాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కామెడీ పుష్కలంగా ఉండడంతో జనాలకు బాగా ఎక్కేసింది. థియేటర్లలో ఆడియెన్స్ ను భయపెట్టి నవ్వించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

OTT Movie: సీరియల్స్‌ చూసి దెయ్యాలుగా మారే భార్యలు.. ఓటీటీలో లేటెస్ట్ హారర్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jun 01, 2025 | 12:06 PM

Share

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఒకటి, రెండు రోజులు లేటైనా ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు నెలలోపే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అలా గత నెలలో బిగ్ స్క్రీన్ పై రిలీజైన ఈ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం తెలుగు ఆడియెన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన చాలా మంది ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటున్నారు. అలాగే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి ఈ మూవీని వీక్షించాలని అనుకుంటున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక ఊరిలో భార్యలందరూ సీరియల్స్‌కు బాగా అలవాటు పడిపోతారు. సాధారణ వేళల్లో భర్తలను దేవుళ్లుగా భావించే భార్యలు సీరియల్స్ చూసే సమయంలో దయ్యాలుగా మారి పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు. దీంతో ఊర్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. దీంతో బాధితులంతా పరిష్కారం కోసం ఓ మాత దగ్గరికి వెళ్తారు. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికిందా? లేదా? అసలు ఆ మహిళలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత ఈ సినిమాను నిర్మించింది.

ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు శుభం. స్టార్ హీరోయిన్ సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన మొదటి సినిమా ఇది. ఆమె కూడా ఓ కీలక పాత్ర పోషించింది. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, షాలిని కొండేపూడి, శ్రావణి లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. జూన్ 13న శుభం సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ‘జియో హాట్‌స్టార్‌లో జూన్ 13న కథ ఆరంబం. చచ్చినా చూడాల్సిందే’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా శుభం ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..