AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్క రోజులోనే దుమ్మురేపుతోన్న సినిమా చూశారా.. ?

మలయాళీ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. ఎప్పటికప్పుడు విభిన్నమైన కంటెంట్ సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంటారు మేకర్స్. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినప్పటికీ.. భారీ అంచనాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ షేక్ చేస్తుంటాయి. కానీ ఇన్నాళ్లు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఓ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

OTT Movie: ఓటీటీని ఊపేస్తోన్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్క రోజులోనే దుమ్మురేపుతోన్న సినిమా చూశారా.. ?
Thudarum
Rajitha Chanti
|

Updated on: Jun 01, 2025 | 6:50 AM

Share

ప్రస్తుతం ఓటీటీలో మలయాళీ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండానే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇన్నాళ్లు బాక్సాఫీస్ షేక్ చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. విడుదలైన ఒక్క రోజులోనే ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ చిత్రాన్ని మీరు చూశారా.. ? అదే తుడరుమ్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. మొదటి రోజు నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్స్ సైతం ఎక్కువే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమాపై అటు తెలుగు అడియన్స్ ఆసక్తి చూపించారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా అని ఎదురుచూశారు ప్రేక్షకులు. ఇన్నాళ్లు థియేటర్లలో మంచి టాక్ అందుకుంటూ దూసుకుపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. దీంతో ఈ సినిమా మంచి హైప్ మధ్య ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రస్తుతం తుడరమ్ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. మే 30న రిలీజ్ అయిన ఈ సినిమా ఒక్కరోజులోనే టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషలలో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. విడుదలైన ఒక్కరోజులోనే ఓటీటీని షేక్ చేస్తుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఈ మూవీకి ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వస్తుంది. తుడరమ్ సినిమా ఇప్పుడు మూడు భాషల్లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో టాప్ లోకి వచ్చింది. ఈ చిత్రానికి భారీగా వ్యూస్ వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో మరిన్ని రోజులు సత్తా చాటే ఛాన్స్ ఉంది.

ఈ చిత్రంలో మోహన్ లాల్ జోడిగా సీనియర్ హీరోయిన్ శోభన నటించారు. తుడరమ్ సినిమా.. మర్డర్, రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ సాగుతుంది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎమోషన్, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రకాష్ వర్మ, బినూ పప్పు, థామస్ మాథ్యూ, అమృత వర్షిని కీలకపాత్రలు పోషించారు. కేరళలో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..