Samantha : పాటలు పాడుతూ.. డాన్స్ చేస్తూ సందడి చేసిన సమంత.. ఫన్నీ వీడియోను షేర్ చేసిన అక్కినేని కోడలు పిల్ల
సౌత్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అండాళ్;ఆ భామ సమంత. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని..
Samantha Akkineni : సౌత్ సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు అండాళ్;ఆ భామ సమంత. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. ఏమాయ చేసావే అన్నట్లుగానే.. తెలుగు ప్రేక్షకులను పూర్తిగా మాయ చేసేసింది సమంత అక్కినేని.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి.. టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తన నటన… స్మైల్ తో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకుంది సమంత అక్కినేని. ఈ వెబ్ సిరీస్ లో సామ్ నటనకు సినీ ప్రియులతోపాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ సాధించడంతో.. సమంతకు పలు ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్లు ఎక్కువగానే వస్తునట్లుగా తెలుస్తోంది. `ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్ లో ఎల్.టి.టి.యి రెబల్ రాజీ పాత్రలో నటనకు గొప్ప ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటీ.
ఫ్యామిలీ మ్యాన్ 2 బ్లాక్ బస్టర్ విజయం సాధించడం వెనక మనోజ్ భాజ్ పాయ్ అద్భుత నటనతో పాటు పోటాపోటీగా రాజీ పాత్రలో సామ్ నటన అంతే పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసింది సమంత. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. షాట్ గ్యాప్ లో పాటలు పాడుతూ ..డాన్స్ లు చేస్తూ సందడి చేసింది సామ్. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :