AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nene Naa OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా లేటెస్ట్‌ థ్రిల్లర్‌.. ‘నేనేనా’ మూవీని ఎక్కడ చూడొచ్చంటే?

గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి రెజీనా చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా కాజల్‌ అగర్వాల్‌తో కలిసి 'కరుంగాపియం( తెలుగులో కార్తీక) అనే ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటించింది. అలా తాజాగా రెజీనా నటించిన చిత్రం 'నేనేనా'. తమిళంలో తెరకెక్కిన 'సూర్పనగై'కు ఇది తెలుగు వెర్షన్‌.

Nene Naa OTT: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా లేటెస్ట్‌ థ్రిల్లర్‌.. 'నేనేనా' మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
Regina Cassandra
Basha Shek
|

Updated on: Sep 22, 2023 | 2:37 PM

Share

గతంలో పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది మద్రాస్ బ్యూటీ రెజీనా కాసాండ్రా. అయితే ఈ మధ్యన ఎక్కువగా సినిమాలు చేస్తోంది. సెలెక్టెడ్‌గా మాత్రమే సినిమాలు చేస్తోంది. అది కూడా లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాది శాకినీ డాకినీ అంటూ నివేదా థామస్‌తో కలిసి రెజీనా చేసిన సందడి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలా ఈ ఏడాది కూడా కాజల్‌ అగర్వాల్‌తో కలిసి ‘కరుంగాపియం( తెలుగులో కార్తీక) అనే ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటించింది. అలా తాజాగా రెజీనా నటించిన చిత్రం ‘నేనేనా’. తమిళంలో తెరకెక్కిన ‘సూర్పనగై’కు ఇది తెలుగు వెర్షన్‌. పీరియాడికల్ ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. అయితే వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైంది.అయితే సరైన బజ్‌, ప్రమోషన్లు లేకపోవడంతో కొన్ని రోజులు మాత్రమే ఆడింది. అయితే ఇప్పుడీ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్‌ లేకుండానే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రస్తుతం నేనేనా సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 3 వారాలకే రెజీనా సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.

ఆ హత్య మర్మమేంటో..

నేనేనా సినిమాకు కార్తిక్‌ రాజు దర్శకత్వం వహించారు. రెజీనాతో పాటు వెన్నెల కిశోర్‌, అక్షర గౌడ, వెన్నెల కిశోర్‌, జయప్రకాష్‌, తాగుబోతు రమేష్‌, జీవా రవి, మైఖేల్‌, కౌషిక్‌ తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రాజశేఖర వర్మ నేనేనా సినిమాను నిర్మించారు. సీఎస్‌ శ్యామ్‌ స్వరాలు సమకూర్చారు. గోకుల్‌ బినోయ్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఇందులో యువరాణిగా, ఆర్కియాలజిస్టుగా డబుల్‌ రోల్‌లో కనిపించింది రెజీనా.. అడవిలో అనుమానాస్పందంగా చనిపోయిన ఓ విదేశీయుడి మర్డర్‌ కేసులో పోలీసులు ఆర్కియాలజిస్ట్‌ దివ్య (రెజీనా) హెల్ప్‌ తీసుకుంటారు. అయితే ఆ హత్య చేసింది దివ్య రూపంలోనే ఉన్న దమయంతి (రెజీనా) అని పోలీసుల విచారణతో తేలుతుంది. మరి ఆర్కియాలజిస్టు దివ్యకు గత జన్మలో యువరాణిగా ఉన్న దమయంతికి సంబంధమేంటి? ఎందుకీ హత్య చేసిందో తెలుసుకోవాలంటే నేనేనా సినిమాను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆహాలో నేనేనా మూవీ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us