సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో మహేందర్ ఇంట్లో పూజగదిలో మూడు అడుగుల నాగుపాము ప్రత్యక్షమైంది. వింత శబ్దాలతో లోపలికి వెళ్లిన కుటుంబ సభ్యులు పామును చూసి ప్రాణభయంతో పరుగులు తీశారు. స్థానికులు కొందరు పాలు పోయగా, మరికొందరు స్నేక్ క్యాచర్ సద్దాంకు సమాచారం అందించారు. సద్దాం చాకచక్యంగా పామును పట్టి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.