Bujjigadu Movie: ప్రభాస్ ‘బుజ్జిగాడు’లో మోహన్ బాబు రోల్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
కొన్ని సినిమాల్లోని పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. హీరోలకు మించి పాపులర్ అవుతుంటాయి. ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలోని మోహన్ బాబు రోల్ అలాంటిదే. శివన్న అనే పవర్ ఫుల్ పాత్రలో ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంది. అయితే పాత్రకు మొదట మోహన్ బాబును అనుకోలేదట.

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో బుజ్జిగాడు ఒకటి. 2008లో రిలీజైన ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ డైలాగ్ మ్యాడ్యులేషన్, స్టైల్ అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్ గా నిలిచాయి. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో త్రిష, సంజన హీరోయిన్లుగా నటించారు. అలాగే మరో కీలకమైన పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించారు. సినిమాలో ప్రభాస్ తర్వాత నిజం చెప్పాలంటే ప్రభాస్ తో సమానంగా హైలెట్ అయిన పాత్ర మోహన్ బాబుదే అని చెప్పుకోవాలి. శివన్న గా ఆయన అభినయం నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కు థియేటర్లలో చప్పట్లు పడ్డాయి. అయితే బుజ్జిగాడు సినిమాలోని మోహన్ బాబు రోల్‌కు సంబంధించి ఇటీవల ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. శివన్న పాత్ర కు మోహన్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదట. పూరి జగన్నాథ్ మొదట ఈ రోల్ కోసం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ని తీసుకోవాలని అనుకున్నాడట. అయితే రాజశేఖర్ అప్పుడు హీరోగా బిజీగా ఉన్నారట. దీంతో శివన్న పాత్రపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో పూరి శివన్న పాత్రకు మోహన్ బాబును తీసుకున్నారట.
ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ బుజ్జిగాడులో ప్రభాస్ కు తోడుగా రాజశేఖర్ చేసి ఉంటే సినిమా ఎలా ఉండేదోనని సినీ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. కాగా రాజశేఖర్ కాకుండా ఈ పాత్ర కోసం దివంగత నటుడు శ్రీహరిని కూడా అనుకున్నారట పూరీ. అప్పటికే కింగ్, నువ్వొస్తానంటే నేనేద్దంటానా సినిమాల్లో హీరోయిన్ త్రిషకు శ్రీహరి అన్నయ్యగా నటించడంతో మళ్లీ ఆయననే తీసుకోవాలనుకున్నారట. అయితే ఆ సమయంలో శ్రీహరి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారట. దీంతో ఫైనల్ గా శివన్న పాత్రకు మోహన్ బాబును ఫైనల్ చేశారట.
కాగా మోహన్ బాబు ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ‘శికంజా మాలిక్’ అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు కలెక్షన్ కింగ్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




