SRH vs RR Highlights, IPL 2026: చిత్తుగా ఓడిన రాజస్థాన్.. హైదరాబాద్ ఖాతాలో రెండో విజయం
Sunrisers Hyderabad vs Rajasthan Royals Indian Premier League 2026 Highlights: హైదరాబాద్ 20 ఓవర్లలో 216 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తొలి బంతికే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును 100 పరుగుల మార్కు దాటించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

Sunrisers Hyderabad vs Rajasthan Royals Indian Premier League 2026 Highlights: 19వ ఐపీఎల్ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 160 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91, హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగులు చేశారు. రాజస్థాన్ తరపున జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్, కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
LIVE Cricket Score & Updates
-
హైదరాబాద్ ఘన విజయం
19వ ఐపీఎల్ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 160 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91, హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగులు చేశారు. రాజస్థాన్ తరపున జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టాడు.
-
7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్..
15.3 ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ స్కోరు 129/7. జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే క్రీజులో ఉన్నారు.
-
-
100 పరుగులు దాటిన రాజస్థాన్..
రాజస్థాన్ 13వ ఓవర్‌లో 100 పరుగుల మార్కును దాటింది. నితీష్ కుమార్ రెడ్డి వేసిన రెండో బంతికి రవీంద్ర జడేజా ఫోర్ కొట్టి జట్టును 100 పరుగుల మార్కు దాటించాడు. అదే ఓవర్‌లో జడేజా, ఫెరీరా ఆరో వికెట్‌కు శతక భాగస్వామ్యాన్ని కూడా పూర్తి చేశారు.
-
జడేజా – ఫెరీరా యాభై పరుగుల భాగస్వామ్యం
తొమ్మిదో ఓవర్‌లో రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా ఆరో వికెట్‌కు యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ జట్టు తొమ్మిది పరుగులకే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది.
-
8 ఓవర్లకు
ఎనిమిది ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా క్రీజులో ఉన్నారు.
-
-
పవర్‌ప్లేలో 5 వికెట్లు
217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. పవర్‌ప్లేలోనే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది. అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింజ్ కేవలం రెండు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతను వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్, లుహాన్ డ్రే ప్రిటోరియస్, ధ్రువ్ జూరెల్ ను పెవిలియన్ చేర్చాడు.
-
5 ఓవర్లకు
5 ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా క్రీజులో ఉన్నారు.
-
3 ఓవర్లకు 5 వికెట్లు..
3 ఓవర్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ 10 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. రియాన్ పరాగ్, ఫెరీరా క్రీజులో ఉన్నారు. అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింజ్ తన మొదటి ఓవర్‌లోనే 3 వికెట్లు పడగొట్టాడు. అతను వైభవ్ సూర్యవంశీ, లుహాన్ డ్రే ప్రిటోరియస్‌లను క్యాచ్ పట్టించగా, ధ్రువ్ జూరెల్‌ను బౌల్డ్ చేశాడు.
-
రాజస్థాన్ టార్గెట్ 217
ఐపీఎల్ 19వ సీజన్‌లోని 21వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతోంది. హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నిర్నీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది.
-
19 ఓవర్లకు
19 ఓవర్లలో హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. సలీల్ అరోరా, అనికేత్ వర్మ క్రీజులో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి (28 పరుగులు) జోఫ్రా ఆర్చర్ చేతికి చిక్కి అవుటయ్యాడు.
-
17 ఓవర్లకు
17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి హైదరాబాద్ 170 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా క్రీజులో ఉన్నారు. హెన్రిచ్ క్లాసెన్ 40 పరుగుల వద్ద అవుటయ్యాడు.
-
150 దాటిన స్కోర్..
15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి హైదరాబాద్ 154 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు.
-
సెంచరీకి 9 పరుగుల దూరంలో ఔట్..
13.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి హైదరాబాద్ 143 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగులు చేసి అవుటయ్యాడు.
-
ఇషాన్ కిషన్ సిక్సర్‌తో అర్ధ సెంచరీ
ఇషాన్ కిషన్ 10వ ఓవర్‌లో తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను 30 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. అతను రవి బిష్ణోయ్ వేసిన నాలుగో బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా బాది, తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్‌లో క్లాసెన్ కూడా ఒక సిక్సర్ కొట్టాడు.
-
చెత్త రికార్డులో అభిషేక్..
Abhishek Sharma Unwanted Record: భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ, ప్రస్తుతం ఒక చేదు రికార్డును మూటగట్టుకున్నాడు. మరిన్ని వివరాల కోసం అభిషేక్ @ 7.. తొలి బంతికే ఔట్.. కట్ చేస్తే.. చెత్త రికార్డులో కాటేరమ్మ కొడుకు..! ఈ ఆర్టికల్‌ను చదవండి
-
పెవిలియన్ చేరిన హెడ్..
ఏడవ ఓవర్‌లోని ఐదవ బంతికి హైదరాబాద్ తమ రెండవ వికెట్‌ను కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ బౌలింగ్‌లో డోనోవన్ ఫెరీరా క్యాచ్ పట్టడంతో, యాభై పరుగుల భాగస్వామ్యం విచ్ఛిన్నమైంది.
-
పవర్ ప్లే ముగిసే సరికి
ఆరు ఓవర్ల తర్వాత హైదరాబాద్ 1 వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. అభిషేక్ శర్మ తొలి బంతికే ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వరుసగా తన రెండవ మ్యాచ్‌లోనూ తొలి బంతికే వికెట్ తీశాడు.
-
3 ఓవర్లకు
3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ టీం ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది.
ఇషాన్ 12, హెడ్ 4 పరుగులతో నిలిచారు.
-
తొలి బంతికే అభిషేక్ ఔట్..
తొలి బంతికే అభిషేక్ శర్మ వికెట్‌ను హైదరాబాద్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జోఫ్రా ఆర్చర్ తొలి బంతికే వికెట్ తీశాడు.
-
రెండు మార్పులతో బరిలోకి హైదరాబాద్
హైదరాబాద్ కూడా హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్‌లను జట్టు నుంచి తొలగించింది.
-
రెండు మార్పులతో బరిలోకి రాజస్థాన్
గత మ్యాచ్‌తో పోలిస్తే ఆర్ఆర్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. షిమ్రాన్ హెట్మెయర్‌కు విశ్రాంతినివ్వగా, బ్రిజేష్‌ను జట్టు నుంచి తొలగించింది.
-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్, కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఎషాన్ మలింగ.
-
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI:
యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.
-
SRH vs RR Toss Update: టాస్ ఓడిన హైదరాబాద్..
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమైంది.
-
SRH vs RR Live Score: టాస్ గెలిస్తే..
ఇప్పటివరకు ఈ స్టేడియంలో 84 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా, వాటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 35 మ్యాచ్‌లు, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 48 మ్యాచ్‌లు గెలిచాయి.
-
Rajiv Gandhi International Stadium Picth Report: పిచ్ రిపోర్ట్..
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండి, బౌలర్లకు కూడా సహకారం అందిస్తుంది. ఇక్కడ తరచుగా అధిక స్కోరు నమోదయ్యే మ్యాచ్‌లు జరుగుతాయి.
-
SRH vs RR Live Score: ఇరుజట్ల రికార్డులు..
ఈ సీజన్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రాజస్థాన్ రాజస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచి, మూడింటిలో ఓడిపోయింది.
-
SRH vs RR: ఉప్పల్‌లో కీలక పోరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది.
Published On - Apr 13,2026 6:14 PM
