AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudigali Sudheer: రష్మి కాదు.. ఆ టాలీవుడ్ యాంకర్‌తో ప్రేమలో సుడిగాలి సుధీర్! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా

జబర్దస్త్ ఫేమ్, హీరో సుడిగాలి సుధీర్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా అతని డేటింగ్ , ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.

Sudigali Sudheer: రష్మి కాదు.. ఆ టాలీవుడ్ యాంకర్‌తో ప్రేమలో సుడిగాలి సుధీర్! ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా
Sudigali Sudheer
Basha Shek
|

Updated on: Apr 13, 2026 | 5:57 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం యాంకర్‌గా పలు షోలకు హోస్టింగ్ చేస్తున్నాడు సుడిగాలి సుధీర్. అలాగే హీరోగానూ వెండితెరపై మెరుస్తున్నాడు. సినిమాలు, టీవీ షోల సంగతి పక్కన పెడితే.. సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే యాంకర్ రష్మి గౌతమ్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆన్ స్క్రీన్ పై ఈ జంటకు చాలా మంచి క్రేజ్ ఉంది.వీళ్లిద్దరూ నిజంగానే ప్రేమికులే అన్నట్లు కెమిస్ట్రీ పండించారు. పలు టీవీ షోస్ లో వీరికి పెళ్లి కూడా చేశారు. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు కాకపోయినా త్వరలోనే పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు భావిస్తున్నారు. యితే తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చాలాసార్లు సుధీర్, రష్మి క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ జంట గురించి నిత్యం ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగానే సుడిగాలి సుధీర్ కు సంబంధించి మరో వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టార్ యాంకర్ దీపికా పిల్లితో అతను ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరూ కలిసి విదేశాల్లో షికార్లు కూడా చేసేస్తున్నారని సోషల్ మీడియాలో తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇలా ఉన్నట్లుండి రూమర్లు రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే. సుధీర్.. యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్‌గా ఉన్న ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనికి తోడు స్వయంగా దీపిక ఇన్ స్టా స్టోరీస్ నుంచే ఆ ఫోటో పోస్ట్ కావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీనిని చూసిన వారు సుధీర్- దీపిక నిజంగానే ప్రేమలో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. అయితే ఇంతలోనే తన వైరల్ ఫొటోపై పూర్తి క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ పెట్టింది దీపిక.

ఈ మేరకు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టిన దీపిక ఇలా రాసుకొచ్చింది. ‘నా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. గతరాత్రి నా స్టోరీలో షేర్ అయింది ‘ఏఐ’ జనరేటెడ్ ఫొటో. నా అనుమతి లేకుండా ఎవరో దాన్ని పోస్ట్ చేశారు. దయచేసి దీన్ని మీరెవరూ షేర్ చేయొద్దు. గత 24 గంటల్లో నా ఖాతాలో పోస్ట్ అయిన ఏ కంటెంట్‌తోనూ నాకు సంబంధం లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఈ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నా’ అని దీపిక చెప్పుకొచ్చింది.

యాంకర్ దీపికా పిల్లి ఇన్ స్టా గ్రామ్ స్టోరీ పోస్ట్..

Anchor Deepika Pilli Post

Anchor Deepika Pilli Post

కాగా సుడిగాలి సుధీర్-దీపిక కలిసి పలు టీవీషోలకు హోస్టింగ్ చేశారు. అలాగే వాంటెడ్ పండుగాడు అనే సినిమాలో హీరో, హీరోయిన్లు గా నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us