Eagle Movie OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న రవితేజ ‘ఈగల్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమాలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అలాగే మరోసారి తన నటనతో అదరగొట్టారు రవితేజ. ఈ సినిమాకు మేకింగ్, యాక్షన్ సీన్స్, రవితేజ యాక్టింగ్ హైలెట్ అయ్యాయి.. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Eagle Movie OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న రవితేజ 'ఈగల్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Eagle Movie OTT
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 29, 2024 | 6:48 AM

టైగర్ నాగేశ్వరరావు తర్వాత మాస్ మాహారాజా రవితేజ నటించిన సినిమా ‘ఈగల్’. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా కనిపించారు. అలాగే నవదీప్ కీలకపాత్ర పోషించారు. ఇదివరకు ఎన్నడు లేని విధంగా ఈ మూవీలో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమాలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అలాగే మరోసారి తన నటనతో అదరగొట్టారు రవితేజ. ఈ సినిమాకు మేకింగ్, యాక్షన్ సీన్స్, రవితేజ యాక్టింగ్ హైలెట్ అయ్యాయి.. అలాగే ఈ మూవీలోని సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ మంచి వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈగల్ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి రోజుకో వార్త నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇన్నాళ్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుందని.. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారని టాక్ నడిచింది. తాజాగా ఈసినిమా మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీతోపాటు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయమై ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టీర సంస్థ గ్రాండ్ లెవల్లో నిర్మించిన ఈ చిత్రానికి దేవంద్జ్ సంగీతం అందించారు. అలాగే ఇందులో వినయ్ రాయ్, అజయ్ ఘోష్ కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో ఆకట్టుకుంటున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

కథ విషయానికి వస్తే..

జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో ఈసినిమా కథ మొదలవుతుంది. ఆమె రాసిన ఒక చిన్న ఆర్టికల్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అది ఈగల్ నెట్ వర్క్ కు సంబంధించింది. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్స్, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకీ టార్గెట్ గా ఉంటుంది. దీనిని సహదేవ్ వర్మ (రవితేజ)నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకొన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతోపాటు పోలాండ్ లోనూ ఆ నెట్ వర్క్ మూలాలు బయటపడతాయి. సహదేవ్ వర్మ ఎవరు ? అతని గతమేమిటి ? అసలు ఈ ఈగల్ నెట్ వర్క్ లక్ష్యమేమిటీ ?ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ పరిశోధనలో ఎలా బయటకొచ్చాయనేది ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.