Jigarthanda Double X OTT: ఇట్స్ అఫీషియల్.. ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

2014లో వచ్చిన జిగర్తాండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది. అంతే కాదు సిద్ధ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిమిషా సజయన్ ఈ చిత్రంలో మలయరసి అనే ప్రధాన పాత్రను పోషించింది. ముఖ్యంగా ఇందులో ఎస్‌జే సూర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Jigarthanda Double X OTT: ఇట్స్ అఫీషియల్.. 'జిగర్ తండా డబుల్ ఎక్స్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Jigarthanda Double X Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2023 | 6:19 PM

కోలీవుడ్ సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన సినిమా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’. రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. 2014లో వచ్చిన జిగర్తాండ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. అలాగే రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ నిర్మించింది. అంతే కాదు సిద్ధ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నిమిషా సజయన్ ఈ చిత్రంలో మలయరసి అనే ప్రధాన పాత్రను పోషించింది. ముఖ్యంగా ఇందులో ఎస్‌జే సూర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. చాలా కాలం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సూర్య.. ఎప్పటికప్పుడు వెయిటేజీ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పటివరకు అతను నటించిన సినిమాలన్ని సినిమాలన్నీ హిట్ అయ్యాయి. వరిసు, టామీ, మార్క్ ఆంటోని, జిగర్తాండ డబుల్ ఎక్స్ ఇలా ఎస్జే సూర్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకున్నాయి.

అలాగే చాలా కాలం తర్వాత చంద్రముఖి 2 సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన లారెన్స్ మరోసారి నిరాశే ఎదుర్కొన్నాడు. కానీ అతడికి మంచి బూస్ట్ ఇచ్చిన చిత్రం జిగర్తాండ డబుల్ ఎక్స్. జిగర్తాండ డబుల్ ఎక్స్ అభిమానుల నుండి మాత్రమే కాకుండా సినీ విమర్శకులు, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎస్.జె.సూర్యను నటిగా ప్రశంసించడం గమనార్హం.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అడియన్స్ ఎదురుచూపులకు బ్రేక్ ఇస్తూ.. ఈ సినిమా రేపు డిసెంబర్ 8న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. తమిళంతో పాటు, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‏లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి నుంచి జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.