OTT Movie: ఇదెక్కడి సిరీస్ రా బాబూ.. మైండ్ టర్నింగ్ మిస్టరీ.. ఓటీటీలోనే టాప్ ట్రెండింగ్..
క్రైమ్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతుంది. ఈమధ్యకాలంలో అలాంటి జానర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీలో ఈ జానర్ చిత్రాలకు, సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తుంది. కానీ ఇప్పుడు మనం మట్లాడుకోబోయే సిరీస్ గురించి తెలుసా.. ? ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సంచలనం సృష్టిస్తుంది.

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడం అంటే చాలా ఆసక్తి ఉంటుందా.. ? అయితే మీరు ఈ సిరీస్ గురించి తెలుసుకోవాల్సిందే. ఓటీటీలో ఇప్పుడు ఓ సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇది సంచలనం సృష్టించింది. అదే క్రిమినల్ జస్టి్స్. ఇది మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని నాల్గవ సీజన్ ఫ్యామిలీ మ్యాటర్స్ కేవలం ఒక హత్య గురించి మాత్రమే కాకుండా ప్రేమ, ద్రోహం, రహస్యాలు, సంబంధాలు వంటి అంశాలతో రూపొందించారు. ఒకప్పుడు భార్యాభర్తలుగా ఉన్న డాక్టర్ రాజ్ నాగ్‌పాల్, అంజు ఇప్పుడు విడివిడిగా నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య అధికారిక విడాకులు లేవు. కానీ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా ఉన్న ఫ్లాట్ లో నివసిస్తున్నారు. రోష్ని అనే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు రాజ్. అయితే ఓ పార్టీ తర్వాత రోష్మి చనిపోయి కనిపిస్తుంది. దీంతో ఆమె హత్య మిస్టరీ చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది.
రోష్ని గర్భవతి అని, గర్భస్రావం కూడా అయిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతుంది. దీంతో ఆమె హత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. గౌరీ కర్మాకర్ అనే వ్యక్తిని సాక్షిగా గుర్తించడం.. హత్య ఆయుధం చెత్త కుప్పలో దొరకడం.. దానిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపడం ఇలా అనేక అంశాలు ఊహించని ట్విస్టులతో ఆద్యంతం ఉత్కంఠంగా మారుతుంది. రోష్ని అంత్యక్రియల సమయంలో ఆమె చితికి సమీపంలో ఒక గుర్తు తెలియని యువకుడు నిలబడి ఉండడం న్యాయవాది మాధవ్ మిశ్రా గమనిస్తారు. అతడు రోష్ని మాజీ ప్రియుడు అని.. అతడితో ఆమెకు విహహం జరిగిందని.. కానీ ఆ తర్వాత రాజ్ తో రోష్ని ప్రేమలో పడడంతో అతడితో పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.
రోష్నీ హత్య ఎవరు చేశారు. ? ఎందుకు చేశారు? అనే విషయాలు తెలుసుకోవడానికి న్యాయవాది మాధవ్ మిశ్రా ప్రయత్నిస్తాడు. ఈ కేసు మొత్తం మరోసారి న్యాయవాది మాధవ్ మిశ్రా చేతుల్లోకి వెళుతుంది. ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్టులు, ఉత్కంఠగా సాగే అంశాలు ఉంటాయి. సత్యాన్ని నిరూపించేందుకు న్యాయవాది ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు ? అనేది ఈ సిరీస్. ప్రస్తుతం ఇది జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..




