AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Godzilla Minus One OTT: ఓటీటీలో వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. ‘గాడ్జిల్లా మైనస్ వన్’ ఎక్కడ చూడొచ్చంటే?

హాలీవుడ్ లో గాడ్జిల్లా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులోనూ ఈ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. గాడ్జిల్లా సిరీస్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాగా ఇదే సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం గాడ్జిల్లా మైనస్ వన్

Godzilla Minus One OTT: ఓటీటీలో వచ్చేసిన ఆస్కార్ విన్నింగ్ మూవీ.. 'గాడ్జిల్లా మైనస్ వన్' ఎక్కడ చూడొచ్చంటే?
Godzilla Minus One Movie
Basha Shek
|

Updated on: Jun 01, 2024 | 5:59 PM

Share

హాలీవుడ్ లో గాడ్జిల్లా సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులోనూ ఈ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. గాడ్జిల్లా సిరీస్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కాగా ఇదే సిరీస్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం గాడ్జిల్లా మైనస్ వన్. గతేడాది రిలీజైన ఈ జపనీస్ సినిమాలో మియామి హమాబ్, కమికి ర్యునోసుకే, యుకీ ఎండ తదితరులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ట‌కాశీ య‌మ‌జాకీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గతేడాది న‌వంబ‌ర్ 03 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం జ‌పాన్‌ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల పంట పండించిన ఈ మూవీ ఆస్కార్ అవార్డుల్లోనూ సత్తా చాటింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేట‌గిరిలో హాలీవుడ్ చిత్రాల‌ను వెన‌క్కి నెట్టి గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా పురస్కారం సొంతం చేసుకుంది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇండియాలో మాత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల కాలేదు. దీంతో ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమా ఓటీటీలోనైనా వస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరి నిరీక్షణకు తెరదించుతూఈ బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా ప్ర‌స్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది నెట్‌ ఫ్లిక్స్.

అయితే ప్రస్తుతం జపనీస్‍తో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే గాడ్జిల్లా మైనస్ వన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇంగ్లిష్ లో సబ్ టైటిల్స్ తో ఈ మూవీ చూడొచ్చు. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది. గాడ్జిల్లా మైనస్ వన్ చిత్రం రెండో ప్రపంచ యుద్ధం కాలమైన 1945 బ్యాక్‍డ్రాప్‍లో పీరియడ్ డ్రామాగా రూపొందింది. అణు బాంబుల ధాటికి హిరోషిమా, నాగసాకి ధ్వంసానికి కాస్త ఫిక్షనల్ స్టోరీని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఆకట్టుకునే కథా, కథనాలు కళ్లు చెరిగే గ్రాఫిక్స్‌ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. మరి ఈ వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకుంటే గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ మంచి ఛాయిస్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్