Aa Okkati Adakku: అప్పుడే OTTలోకి వచ్చేసిన.. నరేష్ కామెడీ ఎంటర్‌టైనర్.

చాలా కాలం తర్వాత హీరో అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. ఒకప్పుడు కామెడీ కథలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేశ్.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ సినిమాలు.. వైవిధ్యమైన కంటెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు తన మార్క్ కామెడీతో ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు.

Aa Okkati Adakku: అప్పుడే OTTలోకి వచ్చేసిన.. నరేష్ కామెడీ ఎంటర్‌టైనర్.

|

Updated on: Jun 01, 2024 | 7:54 PM

చాలా కాలం తర్వాత హీరో అల్లరి నరేష్ నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కు. ఒకప్పుడు కామెడీ కథలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నరేశ్.. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. సీరియస్ యాక్షన్ సినిమాలు.. వైవిధ్యమైన కంటెంట్ కథలను సెలక్ట్ చేసుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు తన మార్క్ కామెడీతో ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. ఇందులో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించగా.. వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్ కాలేకపోయింది. కామెడీ పరంగా అలరించినా.. అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. అటు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 31 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇన్నాళ్లు థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఈ కామెడీ సినిమాను ఇంట్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా కేవలం తెలుగు భాషలోనే అందుబాటులో ఉంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఓటీటీ ఫీల్డ్‌లో ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే వయసు పెరిగిన అబ్బాయి పెళ్లి కోసం పడే తంటాలను ఈ చిత్రంలో చూపించారు. పెళ్లి చేసుకోవడానికి హీరో పడే కష్టాలు, మాట్రిమొని సైట్స్ ను కలవడం.. అందులో వారు చేసే మోసాలను కళ్లను కట్టినట్లుగా చూపించారు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us