AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమమ్ హీరో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ .. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రేమమ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు కూడా ఫేవరెట్ హీరో అయిపోయాడు మలయాళం నటుడు నివిన్ పౌలీ. ఇక గతేడాది సర్వం మాయ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక అతను నటించిన మరో రీసెంట్ మలయాళం సినిమా ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు వెర్షన్ కూడా ఉంది.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన ప్రేమమ్ హీరో రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ .. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 24, 2026 | 11:52 AM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఏప్రిల్ 24) ఓటీటీలోకి కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషలకు చెందిన కొత్త సినిమాలు, డబ్బింగ్ మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. ఇందులో ఒక మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ ఇందులో హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. సర్వం మాయ రేంజ్ లో కాకపోయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఈ మూవీ ఒరిజినిల్ మలయాళం వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ రాజకీయాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. అయితే వర్గీస్ పెద్ద కొడుకు జాన్ (నివిన్ పౌలీ) మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కుమారుడు టోబిన్, తండ్రి బాటలోనే నడుస్తూ రాజకీయాల్లోకి అడుగు పెడతాడు. యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో ముఖ్యమంత్రి పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. అయితే తండ్రిపై పడిన మచ్చను చెరిపేసేందుకు జాన్ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే అతనికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. మరి తండ్రిలాగే పాలిటిక్స్ లోకి అడుగు పెట్టిన జాన్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథ.

ఈ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రతిఛాయ’. దశాబ్దం క్రితం కేరళ రాజకీయాలను కుదిపేసిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉన్ని కృష్ణన్ తెరకెక్కించిన ఈ సినిమా గత నెల 26న థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నివిన్ పౌలీతో పాటు షరాఫ్ యు డీన్, అన్ అగస్టీన్, హరిశ్రీ అశోకన్, విష్ణు అగస్త్య, సబితా ఆనంద్, చిరాగ్ జానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి సినిమా చూడాలనుకునేవారు, అలాగే నివీన్ పౌలీ అభిమానులు కూడా ఈ మూవీపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో నివిన్ పౌలీ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు