Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robinhood: ఓటీటీలో దూసుకుపోతున్న నితిన్ రాబిన్‌హుడ్‌.. ఊహించని రెస్పాన్స్..

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన చిత్రం రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించారు. భారీ హైప్ మీద విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.

Robinhood: ఓటీటీలో దూసుకుపోతున్న నితిన్ రాబిన్‌హుడ్‌.. ఊహించని రెస్పాన్స్..
Robinhood Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2025 | 8:48 PM

డైన‌మిక్ స్టార్ నితిన్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ ప్యాక్డ్ థ్రిల్ల‌ర్ ‘రాబిన్‌హుడ్’ మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసే ప్రేక్ష‌కులు ఉహించ‌లేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో సాగే ఈ చిత్రంలో ప్రేక్ష‌కులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్ష‌న్ కూడా ఉంటుంది. ఈ చిత్రం మే 10 నుండి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే యాభై మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోయింది.

‘రాబిన్‌హుడ్‌’ క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారి ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ను దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజ‌మైన వ్య‌క్తితో త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. అక్క‌డి నుంచి రామ్ క‌థ ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది. త‌ను నీరా (శ్రీలీల‌)తో క‌లిసి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన దొంగ‌త‌నాలు, ప్రాణాంత‌క‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొన‌టానికి సిద్ధ‌మ‌వుతాడు. అంతా బాగుంద‌ని భావిస్తున్న త‌రుణంలో క‌థ అతి పెద్ద ట్విస్ట్ తిరుగుతుంది. అప్పుడు రామ్‌, నీరా ఏం చేశారు? స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనే ట్విస్ట్ ఏంటి? అనే అంశాలు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఉత్కంఠ‌త‌కు గురి చేస్తాయి.

థియేటర్లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించిన ‘రాబిన్‌హుడ్’ ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా ‘రాబిన్‌హుడ్’ జీ5లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ‘రాబిన్‌హుడ్’ 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరి కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అల్లు అర్జున్ గ్రూపు నుంచి బయటికి వచ్చేసిన విష్ణు
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
అడ్డంగా దొరికిపోయిన తుడరుమ్ టీం? కాపీ ఆరోపణలు చేసిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
RRR దారిలో రాజాసాబ్! నోరు జారి హింట్ ఇచ్చిన డైరెక్టర్
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
ఈ సీజనల్‌ పండుతో ఎన్నో లాభాలు.. తప్పకుండా తినమంటున్న నిపుణులు
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మమ్ముట్టి ఆరోగ్యం బాలేదు ?? అసలు విషయం చెప్పిన హీరో ఫ్రెండ్
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
మళ్లీ వచ్చేశాడ్రా.. బాబూ.. నోరు అదుపులో పెట్టుకోమంటున్న నెటిజన్లు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
దినసరి కూలీకి రూ.7 కోట్ల ఐటీ నోటీసులు
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటమూ నేరమే -పవన్‌
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఆ తండ్రి కూతురికిచ్చిన కట్నమేంటో తెలుసా ?? ఇవి కూడా ఇస్తారా మావా.
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది
ఇదేం ముగ్గురా నాయనా.. దగ్గరికెళ్లి చూస్తే గుండె ఆగినంత పనైంది