Inspector Rishi OTT: ఈ సిరీస్ చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. వణుకుపుట్టించే హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన తంత్ర సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలో ఇప్పుడు మరో హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అదే ఇన్‏స్పెక్టర్ రిషి. టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, సునైన, కన్న రవి, శ్రీకృష్ణ దయాల్ కీలక పాత్రలలో నటించారు. దీనికి జె.ఎస్ నందిని దర్శకత్వం వహించగా.. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. హారర్ క్రైమ్, సూపర్ నాచురల్ కథతో రూపొందించిన ఈ సిరీస్..

Inspector Rishi OTT: ఈ సిరీస్ చూడాలంటే గుండె ధైర్యం కావాల్సిందే.. వణుకుపుట్టించే హారర్ క్రైమ్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..
Inspector Rishi Ott
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 29, 2024 | 10:36 AM

డిజిటల్ ప్లాట్ ఫామ్ పై హారర్ కంటెంట్.. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు సినీ ప్రియులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొమాంటిక్, కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే కాకుండా సస్పెన్స్ వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు అటు మేకర్స్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ అయిన హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్‏లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల థియేటర్లలో రిలీజ్ అయిన తంత్ర సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అడియన్స్. ఈ క్రమంలో ఇప్పుడు మరో హారర్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. అదే ఇన్‏స్పెక్టర్ రిషి. టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర, సునైన, కన్న రవి, శ్రీకృష్ణ దయాల్ కీలక పాత్రలలో నటించారు. దీనికి జె.ఎస్ నందిని దర్శకత్వం వహించగా.. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. హారర్ క్రైమ్, సూపర్ నాచురల్ కథతో రూపొందించిన ఈ సిరీస్.. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

హారర్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కంటెంట్ తో రూపొందించిన ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 35 నుంచి 60 నిమిషాల నిడివితో మొత్తం పది ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. మనుషులకు గూడు పెట్టే ఓ రాకాసి దెయ్యం కథ నేపథ్యంలో ఈ సిరీస్ సాగనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ వైవిధ్యమైన కథలతో అలరించిన నవీన్ చంద్ర ఇప్పుడు హరర్ కంటెంట్ తో భయపెట్టెందుకు రెడీ అయ్యాడు.

కథ విషయానికి వస్తే… తీన్ కాడు అనే ప్రాంతంలోని అడవిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. జంతువల కళేబరాలకు పట్టినట్లే మనుషుల శవాలకు పురుగుల గూడు అల్లుకుని ఉంటుంది. అడవిలో తరిగే రాట్చి అనే దెయ్యమే ఈ హత్యలు చేస్తుందని ఊరి జనం నమ్ముతుంటారు. అయితే ఈ వరుస హత్యల కేసు ఇన్వెస్టిగేషన్ సీబీ సీఐడీకి చేరుతుంది. అయితే ఈ హత్యలకు గల కారణాలను తెలుసుకునేందుకు ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్‏స్పెక్టర్ రిషి విచారణ స్టార్ట్ చేస్తాడు. ఆ సమయంలో పోలీసులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? అసలు వరుస హత్యలు చేస్తుంది ఎవరు? ఆ దెయ్యం కారణమైతే దాని నుంచి ఇన్‏స్పెక్టర్ రిషి ఎలా తప్పించుకున్నాడు? అనే విషయాలను ఈ సిరీస్ లో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.