OTT Movie: సంక్రాంతి పండక్కి ఓటీటీలోకి వచ్చేసిన మరో తెలుగు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

థియేటర్లలో ఈసారి నాలుగు సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం.. యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

OTT Movie: సంక్రాంతి పండక్కి ఓటీటీలోకి వచ్చేసిన మరో తెలుగు సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
#mayalo
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 16, 2024 | 7:26 AM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావిడి మాములుగా లేదు. నగరంలోని జనాలంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబాలతో పండగ జరపుకుంటున్నారు. మరోవైపు థియేటర్లలో ఈసారి నాలుగు సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం.. యంగ్ హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్, వెంకటేశ్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ సినిమాలో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే అటు ఓటీటీల్లోనూ బోలెడు సినిమాలు సినీ ప్రియులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇప్పటికే కళ్యామ్ రామ్ నటించిన డేవిల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే #మాయలో అనే తెలుగు మూవీ.

చిన్న సినిమాగా డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది ఈ సినిమా. అయితే ప్రేక్షకులకు ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనే విషయం చాలా మందికి తెలియదు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో అంతగా ఫేమస్ అయిన నటీనటులు లేకపోవడం.. ప్రమోషన్స్ జరగకపోవడంతో ఈ మూవీ జనాలకు తెలియదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో సరదాగా ఉన్నవారు ఈ పండక్కి టైంపాస్ కావాలంటే.. ఈ కొత్త సినిమాను చూసేయండి.

మాయలో సినిమాకు మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం నరేశ్ అగస్త్య, జ్ఞానేశ్వరి ప్రధాన పాత్రలు పోషించారు. కథ విషయానికి వస్తే.. మాయ (జ్ఞానేశ్వరి)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. తన చిన్ననాటి స్నేహితులు క్రిష్ (నరేశ్ అగస్త్య), సింధు (భావన)ను తన వివాహనికి ఆహ్వనిస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఓ కారు అద్దెకు తీసుకుని వస్తుంటారు. వారి ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ?.. చివరకు ఏమైంది ? అనేది #మాయలో సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.