12th Fail Movie: ’12th ఫెయిల్’ పైవిజయ్ దేవరకొండ ప్రశంసలు.. బ్లాక్ బస్టర్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
లాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తోనే కోట్లాది రూపాయలు వసూళ్లు రాబట్టింది. రూ.20 కోట్లతో తెరకెక్కిన 12th ఫెయిల్ ఓవరాల్ గా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.
12th ఫెయిల్.. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు. ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని విధు వినోద్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించాడు. విక్రాంత్ మస్సే మనోజ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఎలాంటి అంచనాలు లేకుండా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదలైన 12th ఫెయిల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా కేవలం మౌత్ టాక్‌తోనే కోట్లాది రూపాయలు వసూళ్లు రాబట్టింది. రూ.20 కోట్లతో తెరకెక్కిన 12th ఫెయిల్ ఓవరాల్ గా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. భారతీయ విద్యావ్యవస్థలోని లోపాలతో పాటు పేద విద్యార్థుల జీవితాలను 12th ఫెయిల్ సినిమాలో ఎంతో చక్కగా, హృద్యంగా చూపించారు డైరెక్టర్ విధు వినోద్ చోప్రా. అందుకే పలువురు సినీ ప్రముఖులు, విమర్శకులు విక్రాంత్ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ 12th ఫెయిల్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టు చేశాడీ స్టార్ హీరో.
‘పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ప్రతి తల్లి, తండ్రి, అమ్మమ్మలకు. మరొకరికి స్ఫూర్తినిచ్చే ప్రతి దుష్యంత్ సార్‌కి. పాండే, గౌరీ భాయ్ వంటి ప్రతి స్నేహితుడికి. శ్రద్ధా లాంటి అమ్మాయికి. అక్కడ ఉన్న ప్రతి మనోజ్‌కి.. నా ప్రేమను అందిస్తున్నాను. మీరు ప్రతి పోరాటాన్ని అధిగమించి విజయం సాధించండి. 12thFail చిత్ర బృందానికి అభినందనలు, కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 12th ఫెయిల్ సినిమా కథ విషయానికి వస్తే.. చంబల్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌కు UPSC ప్రిపరేషన్ కోసం వచ్చిన మనోజ్ ఢిల్లీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తన కలను ఎలా సాకారం చేసుకున్నాడన్నదే ఈ మూవీ సారాంశం. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
విజయ్ దేవరకొండ ట్వీట్..
12th fail ❤️
To every mother, father and grandmother fighting for their kids future.
To every Dushyanth sir who inspires another.
To every friend like Pandey and Gauri bhai.
To every blessing that is Shradda.
And to every Manoj out there.. my heart and prayers go out to…
— Vijay Deverakonda (@TheDeverakonda) January 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.