Killer Soup In OTT: ఉత్కంఠగా ‘కిల్లర్ సూప్’ వెబ్ సిరీస్ ట్రైలర్.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతంలో ఉడ్తా పంజాబ్, సోంచారియా వంటి డార్క్ క్రైమ్ సినిమాలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కొంకణా సేన్ శర్మ కథానయికగా నటిస్తోంది. నాజర్, షయాజీ షిండే, లాల్, రాజీవ్ రవీంద్ర నాథన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కిల్లర్ సూప్ సిరీస్ పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ క్రైమ్ సిరీస్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఇందులో అతని నటన అందరినీ ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లో రానున్నారు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ కిల్లర్ సూప్. గతంలో ఉడ్తా పంజాబ్, సోంచారియా వంటి డార్క్ క్రైమ్ సినిమాలను తెరకెక్కించిన అభిషేక్ చౌబే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కొంకణా సేన్ శర్మ కథానయికగా నటిస్తోంది. నాజర్, షయాజీ షిండే, లాల్, రాజీవ్ రవీంద్ర నాథన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కిల్లర్ సూప్ సిరీస్ పోస్టర్స్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. తాజాగా ఈ క్రైమ్ సిరీస్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. సుమారు 2నిమిషాల 22 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. అసలు స్టోరీ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వకుండా ఆసక్తికరమైన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో సిరీస్‌పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో వినిపించే బాంబే సినిమాలోని తూహీరే సాంగ్ అయితే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 11 న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ క్రైమ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ క్రైమ్ సిరీస్‌లో మనోజ్ బాయ్‌పాయ్ డబుల్ రోల్ పోషించనున్నారు. ‘నా కెరీర్‌లో మొదటిసారిగా నేను ద్విపాత్రాభినయం చేస్తున్నాను. రెండు పాత్రలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అభిషేక్ చౌబే దర్శకత్వం చాలాబాగుంది. కిల్లర్ సూప్ అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ కావొచ్చు. కానీ అందరినీ అలరిస్తుంది’ అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పుకొచ్చారు.
కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ ట్రైలర్
Umesh and Swathi are stirring up the most bizarre crime thriller of the year- and the secrets are about to boil over! 🔥🍲
KILLER SOUP TRAILER OUT NOW!! @konkonas @nasser_kameela #Nasser @SayajiShinde @LalDirector #AbhishekChaubey @honeytrehan @MacguffinP @NetflixIndia… pic.twitter.com/PCl7wNLsKo
— manoj bajpayee (@BajpayeeManoj) January 3, 2024
తెలుగులోనూ స్ట్రీమింగ్..
#KillerSoup STREAMING ON JANUARY 11th. #Netflix
TRAILER OUT NOW.
HINDI, TAMIL TELUGU & MALAYALAM. pic.twitter.com/bJ3Ert94AT
— Cinemy (@HdUpdatesMovie1) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి