OTT Movie: వితంతువులను లోబర్చుకుని.. ఓటీటీలో సైకో థ్రిల్లర్ సినిమా సంచలనం.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సైకో థ్రిల్లర్ మూవీ ఓవరాల్ గా రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

గత వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన చిత్రాలు, సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీ మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. సీరియల్ కిల్లర్ చుట్టూ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో హాట్ టాపిక్ గా మారింది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించే కథా, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడీ క్రైమ్ థ్రిల్లర్ మ మూవీ ఓటీటీ టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది. అంతకు ముందు కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై కూడా సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తద్వారా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. గతంలో తమిళనాడు- కేరళ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన సైనేడ్ మోహన్ కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకక్కించారు
ఈ సినిమాలో స్టాన్లీ దాస్ అనే సీనియర్ పోలీసాఫీసర్ తన భార్య పిల్లలతో హాయిగా జీవిస్తుంటాడు. ఇది అందరికీ తెలిసిన కోసం. కానీ అతనిలో మరో వికృత కోణం కూడా ఉంటుంది. ఒంటరి మహిళలు, వితంతువులు, డివోర్స్ అయిన మహిళలని లక్ష్యంగా చేసుకుని వారిని లోబర్చుకుంటాడు. వాళ్లకు కొత్త జీవితాన్ని ఇస్తానని ఆశ చూపెట్టి హోటల్ రూమ్ కు తీసుకెళ్లి వాళ్లను దారుణంగా చంపేస్తుంటాడు. తనతో వచ్చిన మహిళలకు ఏదో విధంగా సైనైడ్ అందించి హతమారుస్తుంటాడు.ఇలా దాదాపు 20 మందికి పైగా మహిళలను ఇలాగే చంపుతాడు స్టాన్లీదాస్.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
You think you know him but you don’t.
Witness #Kalamkaval, now streaming on Sony LIV.#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @SamadTruth #WayfarerFilms #TruthGlobalFilms #KalamkavalOnSonyLIV pic.twitter.com/iUJ9tUwO32
— Sony LIV (@SonyLIV) January 19, 2026
మరి ఈ స్టాన్లీ దాస్ ఎందుకిలా సైకో కిల్లర్ గా మారాడు? పోలీసులు అతన్ని పట్టుకున్నారా? లేదా? చివరికి స్టాన్లీదాస్ ఏమయ్యాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ మలయాళం సినిమా పేరు కలంకావల్. ప్రస్తుతం సోనీ లివ్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో సైకో కిల్లర్ గా నటించడం గమనార్హం.
తెలుగులోనూ స్ట్రీమింగ్..
The faces that stay with us!
Witness #Kalamkaval, now streaming on Sony LIV.#Mammootty @mammukka #Vinayakan #MammoottyKampany #JithinKJose @SamadTruth #WayfarerFilms #TruthGlobalFilms #KalamkavalOnSonyLIV pic.twitter.com/iAZ8FNDP7Z
— Sony LIV (@SonyLIV) January 18, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




