ఆమె ఫోన్ నెంబర్ కోసం పెద్ద సాహసమే చేశా.. నా సినిమా చేయడానికి ఆమె ఆలోచించింది : సందీప్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు నాట సెన్సేషన్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. ఆర్జీవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో సెన్సేషనల్ డైరెక్టర్ వచ్చాడన్న మాటలు వినిపించాయి. ఈ మాటలను నిజం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమానే హిందీలో తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. బాలీవుడ్ లోనూ గట్టిగా జెండా పాతేశాడు.

చేసింది తక్కువ సినిమాలే అయినా ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ.. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు సందీప్. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ కూడా పెరిగిపోయింది. అలాగే ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో తీసి మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇక యానిమల్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన యానిమల్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. ఇటీవలే స్పిరిట్ సినిమా నుంచి పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి కాంచనను తన సినిమాలో తీసుకోవడం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాలా మందికి ఆమె ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని, ఆర్థికంగా ఆమె పరిస్థితి సరిగా లేదని వార్తలు వచ్చాయి.. కానీ ఆమె ట్రస్టుకు కోట్లు విరాళంగా ఇచ్చారని వంగా స్పష్టం చేశారు. తన పాత్రకు విద్యావంతురాలైన, మనవాడి భావాలను అర్థం చేసుకునే, నిష్కలంకమైన ఇంగ్లీష్ మాట్లాడే నానమ్మ అవసరమని ఆయన తెలిపారు. కాంచన ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి 1960లలో పట్టభద్రురాలైందనే ఒక నేపథ్య కథను కూడా తాను రాసుకున్నానని పేర్కొన్నారు.
కాంచనను సినిమాకు తీసుకురావడం ఓ పెద్ద సాహసమేనని వంగా అన్నారు. కృష్ణంరాజుగారి పుట్టినరోజు వేడుకలో తన స్నేహితుడి స్నేహితుడి ద్వారా ఆమె నంబర్ సంపాదించే ప్రయత్నం చేశానని, అలాగే ఒక మేకప్ మ్యాన్ ద్వారా కూడా ప్రయత్నించానని, కానీ ఎక్కడా సమాచారం దొరకలేదని అన్నారు సందీప్. చివరకు ఆమె నంబర్ దొరక్కగా, ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మొదట సంకోచించారని అన్నారు సందీప్. చేద్దాం, చూద్దాం, ఏం చేస్తాం సినిమాలో? అన్నట్లుగా మాట్లాడారు.. అలాగే 34 ఏళ్ల తర్వాత కెమెరాను ఎదుర్కోవడం, డిజిటల్ టెక్నాలజీ అంతా ఆమెకు కొత్తగా అనిపించిందని సందీప్ అన్నారు. తాను, విజయ్ చెన్నై వెళ్లి కాంచనను కలిసినప్పటికీ, ఆమె వెంటనే అంగీకరించలేదని వంగా అన్నారు. దేవుడు పర్మిట్ చేస్తే సెట్‌కి వస్తాను అని మాత్రమే ఆమె చెప్పారని, షూటింగ్‌కు కేవలం ఎనిమిది రోజుల ముందు ఆమె వస్తారని ఖరారైందని తెలిపారు. ఆమె నాతో మాట్లాడుతూ.. సందీప్, 34 ఏళ్లుగా నాకు ఎవరూ ఎలా నడవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఏం ధరించాలో చెప్పలేదు. నువ్వు అది చేస్తున్నావు అని అన్నారు. తాను దాన్ని ఒక ప్రివిలేజ్‌గా భావిస్తున్నానని వంగా చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




