Yashasvi Jaiswal : 47 బంతుల్లోనే 100..టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో తీసుకోలేదన్న కసి మొత్తం చూపించాడుగా..
Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదన్న బాధను తన బ్యాటింగ్ పవర్‌తో పటాపంచలు చేశాడు. తాజాగా కేవలం 47 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు.

Yashasvi Jaiswal : టీమిండియా యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదన్న బాధను తన బ్యాటింగ్ పవర్‌తో పటాపంచలు చేశాడు. టీమిండియాలో విపరీతమైన పోటీ ఉండటం వల్ల ప్రస్తుతం ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నప్పటికీ, తన దగ్గర ఉన్న టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. తాజాగా కేవలం 47 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. ఈ యువ ఓపెనర్ సిక్సర్ల వర్షం కురిపించిన తీరు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
జైస్వాల్ ఈ విన్యాసం చేసింది ఏదో ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనో లేదా ప్రాక్టీస్ సెషన్‌లోనో కాదు. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ తన యూట్యూబ్ ఛానెల్ ద స్విచ్ కోసం జైస్వాల్‌కు ఒక కఠినమైన ఛాలెంజ్ విసిరాడు. ప్రపంచానికి జైస్వాల్ అసలు సిసలైన బ్యాటింగ్ పవర్‌ను చూపించడమే పీటర్సన్ ఉద్దేశ్యం. ఈ ఛాలెంజ్‌లో భాగంగా 50 బంతుల్లో 100 పరుగులు చేయాలి. అయితే ఇందులో రెండు కండిషన్లు ఉన్నాయి. ఒకటి.. ప్రతి బంతికి వేగం 1 మైలు పెరుగుతుంది. రెండు.. అవుట్ అయితే స్కోర్ నుంచి 5 పరుగులు కోత విధిస్తారు.
ఇంగ్లాండ్‌లోని ఒక లోకల్ గ్రౌండ్‌లో జరిగిన ఈ పోటీలో జైస్వాల్ బౌలింగ్ మిషన్ ఎదుట బ్యాటింగ్ చేశాడు. 51 మైళ్ల వేగంతో మొదలైన ఈ సవాల్‌లో జైస్వాల్ ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మధ్యలో రెండు సార్లు అవుట్ అవ్వడంతో 10 పరుగులు మైనస్ అయ్యాయి. బంతి వేగం పెరిగేకొద్దీ ఆడటం కష్టమైనప్పటికీ, జైస్వాల్ ఏమాత్రం తడబడలేదు. చివరికి 47వ బంతికి భారీ సిక్సర్ బాది తన సెంచరీ మార్కును దాటేశాడు. ఇది చూసి పీటర్సన్ కూడా షాక్ అయ్యాడు. జైస్వాల్ హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ అద్భుతమని కొనియాడాడు.
ఇది కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే అయినప్పటికీ, జైస్వాల్ ఫిట్‌నెస్, బ్యాటింగ్ సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కకపోయినా, తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదని నిరూపించాడు. ఇప్పుడు జైస్వాల్ కళ్ళు ఐపీఎల్ 2026 సీజన్‌పై ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా మారిన జైస్వాల్, ఈసారి ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి మళ్ళీ టీమిండియా టీ20 జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
