AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Car: 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. టయోటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు!

Toyota Urban Cruiser EV: క్యాబిన్ లేఅవుట్, ఫీచర్లు ఈ-విటారా మాదిరిగానే ఉంటాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఈ ఫీచర్స్‌తో్ వస్తుందని భావిస్తున్నారు. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే..

Electric Car: 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. టయోటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు!
Toyota Urban Cruiser Ev
Subhash Goud
|

Updated on: Jan 19, 2026 | 6:55 PM

Share

Toyota Urban Cruiser EV: టయోటా అర్బన్ క్రూయిజర్ EV భారతదేశంలో జనవరి 19, 2026 నుండి అందుబాటులోకి రానుంది. ఇది టయోటా సిగ్నేచర్ స్టైలింగ్‌ను ప్రతిబింబించేలా కొన్ని కాస్మెటిక్ మార్పులతో రీబ్యాడ్జ్ చేసిన మారుతి సుజుకి ఇ విటారా. ఇది మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV లతో నేరుగా పోటీపడుతుంది. రాబోయే రోజుల్లో ధరలు ప్రకటించనున్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనం బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.21 లక్షలు, టాప్ వేరియంట్ ధర దాదాపు రూ.26 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.

అధికారిక పవర్‌ట్రెయిన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇతర వివరాలు ప్రస్తుతం రహస్యంగా ఉన్నాయి. అయితే కొత్త టయోటా ఎలక్ట్రిక్ SUV e-Vitara లాగానే 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించే అవకాశం ఉంది. రెండు బ్యాటరీలు ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ గరిష్టంగా 144bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెద్దది 174bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500km కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Bank Loan: SBI నుండి రూ.40 లక్షల హోమ్‌ లోన్‌ కోసం మీకు ఎంత జీతం ఉండాలి? నెలవారీ EMI ఎంత?

ఇవి కూడా చదవండి

అద్భుతమైన డిజైన్:

కొత్త టయోటా ఎలక్ట్రిక్ SUVలో DRLలతో కూడిన LED హెడ్‌లైట్లు, మధ్యలో టయోటా సిగ్నేచర్ బ్యాడ్జ్‌తో కూడిన మందపాటి నలుపు ట్రిమ్ ఉంటుందని తాజా టీజర్ ధృవీకరిస్తుంది. చివరి వేరియంట్ గత సంవత్సరం ఇండియా మొబిలిటీ షోలో ప్రదర్శించిన దాదాపు పూర్తి మోడల్‌ను పోలి ఉంటుంది.

కారులో శక్తివంతమైన ఫీచర్లు :

క్యాబిన్ లేఅవుట్, ఫీచర్లు ఈ-విటారా మాదిరిగానే ఉంటాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ EV ఈ ఫీచర్స్‌తో్ వస్తుందని భావిస్తున్నారు. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, గ్లాస్ రూఫ్, లెవల్ 2 ADAS, ఏడు ఎయిర్‌బ్యాగులు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్‌స్పాట్ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.

ఇది కూడా చదవండి: Home Loan: ఈ ఒక్క పని చేస్తే రూ.50 లక్షల రుణంపై రూ.18 లక్షలు ఆదా.. బ్యాంకర్లు కూడా ఆశ్చర్యపోతారు!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి