AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు

ప్రస్తుతం మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఓటీటీలో అయితే మలయాళం సినిమాలను ఎగబడి చూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఓ మలయాళం బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 15, 2026 | 4:01 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, టోస్టర్, దో దివానే షెహర్ మే తదితర సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు పోచమ్మ, మట్కా కింగ్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే బుధవారం ( ఏప్రిల్ 15) అర్ధరాత్రి నుంచే ఓ మలయాళం బ్లాక్ బస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఒరిజినల్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 06న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు సరికొత్త థ్రిల్ అందించింది. సస్పెన్స్, మిస్టరీ అంశాలకు టైమ్ లూప్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు స్థానికులెవరూ సాహసం చేయరు. ఆ అడవిలోకి వెళితే ఎవరూ తిరిగి రారని వారి నమ్మకం. ఇదే క్రమంలో ఈ ఏరియా పోలీస్ స్టేషన్‌కు కొత్తగా ట్రాన్స్‌ఫర్ అవుతాడు ఆనంద్. ఆ తర్వాత ఇదే స్టేషన్‌లో పని చేస్తున్న రెజీ, స్టీఫెన్ అనే పోలీసులు నైట్ డ్యూటీకి వెళ్లగా… అడవిలో ఓ శవం కనిపిస్తుంది.

ఆ మృతదేహం వద్దకు వెళ్లిన వారు కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయాన్ని చూస్తారు. అంతే అక్కడి నుంచే అసలు కథ స్టార్ట్ అవుతుంది. అడవిలోకి వచ్చిన ఆనంద్, అతని టీంకు చిత్ర విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ మృతదేహం ఎవరిది? హత్య చేసింది ఎవరు? కాకి ఆకారంలో అక్కడ ఆలయం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏంటి? అడవిలోకి వచ్చిన వారు ఎందుకు మిస్ అవుతున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

జియో హాట్ స్టార్ లో మలయాళం బ్లాక్ బస్టర్..

ఈ మలయాళం సినిమా పేరు సంభవం అధ్యాయం ఒన్ను. జీతూ సతీషన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మాల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..