OTT Movies: ఇండిపెండెన్స్‌డే స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

|

Aug 12, 2024 | 4:26 PM

స్వాతంత్ర్య దినోత్సవంతో థియేటర్ల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం డబుల్ ఇస్మార్ట్‌, మిస్టర్‌ బచ్చన్‌ లాంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్‌ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

OTT Movies: ఇండిపెండెన్స్‌డే స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us on

స్వాతంత్ర్య దినోత్సవంతో థియేటర్ల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ వారం డబుల్ ఇస్మార్ట్‌, మిస్టర్‌ బచ్చన్‌ లాంటి క్రేజీ సినిమాలు ఆగస్టు 15న విడుదలవుతున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తంగలాన్‌ సినిమా కూడా ఇండిపెండెన్స్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన ఆయ్ సినిమా కూడా థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ప్రియ దర్శి, నభా నటేష్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డార్లింగ్ పై చాలా మంది దృష్టి ఉంది. అలాగే కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, ఫాహద్ ఫాజిల్ ప్రధానపాత్రల్లో నటించిన మనోరతంగల్‌ వెబ్ సిరీస్ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. వీటితో పాటు ఇంగ్లిష్, హిందీ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అయ్యాయి. మరి ఆగస్టు మూడో వారంలో ఏయే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకుందాం రండి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో

  • డార్లింగ్ (తెలుగు సినిమా)- ఆగస్ట్ 13
  • స్టార్ వార్స్: యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 14
  • మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో

  • మాట్ రిఫే: లూసిడ్‌ – ఏ క్రౌడ్‌ వర్క్ స్పెషల్- ఆగస్టు 13
  • డాటర్స్‌ (డాకుమెంటరీ)- ఆగస్టు 14
  • రెన్‌ఫీల్డ్‌ (హాలీవుడ్‌)- ఆగస్టు 14
  • వరస్ట్‌ ఎక్స్‌ ఎవర్(క్రైమ్‌ డాకుమెంటరీ సిరీస్)-ఆగస్టు 15
  • యావరేజ్ జో సీజన్‌ -1- ఆగస్టు 15
  • బ్యాక్‌యార్ట్‌ వైల్డర్‌నెస్‌- ఆగస్టు 15
  • ఎమిలీ ఇన్‌ పారిస్ సీజన్‌-4- పార్ట్ 1- ఆగస్టు 15
  • కెంగన్‌ అసుర సీజన్‌ 2- పార్ట్‌ 2- ఆగస్టు 16
  • ఐ కెనాట్ లైవ్‌ వితౌట్ యూ- ఆగస్టు 16
  • పెరల్- ఆగస్టు 16
  • షాజమ్- ఫ్యూరీ ఆఫ్‌ గాడ్స్‌- ఆగస్టు 17
  • ది గార్‌ఫీల్డ్‌ మూవీ(యానిమేషన్‌ చిత్రం)- ఆగస్టు 17

జీ5

  • మనోరతంగల్(తమిళ సిరీస్‌)- ఆగస్టు 15
  • కంటాయే కంటాయే(హిందీ సినిమా)- ఆగస్టు 15

ఈటీవీ విన్ ఓటీటీ

  • వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా)- ఆగస్ట్ 14

జియో సినిమా

  • ఇండస్ట్రీ సీజన్‌-3(వెబ్ సిరీస్‌)- ఆగస్టు 12
  • శేఖర్ హోమ్‌(బెంగాలీ వెబ్ సిరీస్‌) – ఆగస్టు 14
  • బెల్ ఎయిర్‌ సీజన్‌-2 – ఆగస్టు 15

సోనీ లివ్‌

  • చమక్: ది కంక్లూజన్‌(హిందీ సినిమా) – ఆగస్టు 16

హోయ్‌చోయ్‌

  • పరిణీత- ఆగస్టు 15

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.