AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఏం సినిమాలు రా బాబూ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. ఈ కోర్టు సినిమాలు చూస్తే మతిపోయినట్టే..

సస్పెన్స్, ట్విస్టులతో సాగే సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఓటీటీలో ఈ జానర్ చిత్రాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం కోర్ట్‌రూమ్ డ్రామాలను ఇష్టపడితే మీకు ఈ సినిమాలు సత్తా చాటుతున్నాయి. అక్షయ్ కుమార్ మరియు అర్షద్ వార్సీ నటించిన "జాలీ LLB 3" చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

Cinema : ఏం సినిమాలు రా బాబూ.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. ఈ కోర్టు సినిమాలు చూస్తే మతిపోయినట్టే..
Court Drama Movies
Rajitha Chanti
|

Updated on: Sep 25, 2025 | 2:47 PM

Share

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ నటించిన “జాలీ LLB 3” సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది. ఇంతకు ముందు అనేక ఆకట్టుకునే కోర్ట్ డ్రామా చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి. ఈ జాబితాలో అక్షయ్ ఖన్నా “సెక్షన్ 375”, సూర్య “జై భీమ్” ఉన్నాయి. ఈ చిత్రాలు ఓటీటీలోనూ దూసుకుపోతున్నాయి. కోలీవుడ్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా 2021లో విడుదలైంది. ఇందులో దొంగతనం ఆరోపణలతో మరణించిన కుర్రాడి కుటుంబానికి న్యాయం చేసే న్యాయవాది పాత్రలో సూర్య కనిపించారు. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..

బాలీవుడ్‌లోని అత్యుత్తమ కోర్టు రూమ్ డ్రామాలలో పింక్ చిత్రం ఒకటి. తాప్సీ పన్ను, కీర్తి కుల్హారి, ఆండ్రియా తరియాంగ్ పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ న్యాయవాదిగా నటించారు. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అక్షయ్ ఖన్నా, రిచా చద్దా నటించిన సెక్షన్ 375 సినిమా 2019లో విడుదలైందిఈ సినిమా క్లైమాక్స్ మనసును కలచివేస్తుంది. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

2022లో విడుదలైన మలయాళ చిత్రం జన గణ మన. పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలు పోషించారు. హీరోగా భావించే వ్యక్తి నిజమైన విలన్‌గా మారడం అసలైన ట్విస్ట్.. ఈ చిత్రం ఒటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. కోర్టు రూమ్ డ్రామా చిత్రం “నేరు” డిసెంబర్ 21, 2023న థియేటర్లలో విడుదలైంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. దక్షిణ నటి ప్రియమణి ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..