Devara OTT: ఓటీటీలో దేవర.. ఆ పండగ స్పెషల్‌గా స్ట్రీమింగ్ కానున్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ
అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది. దక్షిణాదితోపాటు నార్త్ లోనూ దేవర చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరవయ్యాయి.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేస్తోంది. దక్షిణాదితోపాటు నార్త్ లోనూ దేవర చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరవయ్యాయి. రెండో వారంలోనూ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోన్న దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై ఒక ఆసక్తికర వార్త నెట్టంట చక్కర్లు కొడుతోంది. దేవర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ దిగ్గజ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకోసం రూ. 150 కోట్లు చెల్లించిందని టాక్. అలాగే థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే దేవర ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌తో మేకర్స్ డీల్ కుదుర్చుకున్నట్లు టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా దేవరను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. లేకపోతే నవంబర్ రెండో వారం అంటే 15వ తేదీ నుంచి ఎన్టీఆర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో దేవర దుమ్ము రేపుతోంది కాబట్టి ఇప్పట్లో దేవర ఓటీటీలోకి వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ఉన్నట్లు ఇది వరకే అనౌన్స్ చేశారు మేకర్స్.
దావూదీ సాంగ్ వచ్చేసింది..
#Daavudi has become the ultimate mood booster for all of us in recent times 💥💥 & Now it’s time to celebrate it in a BIG way on the Big Screens 😎🕺🏻
Let’s set the stage on fire ❤️🔥 Enjoy #Devara in cinemas near you 🤙🏻#BlockbusterDevara pic.twitter.com/FbGLUzyYN4
— Devara (@DevaraMovie) October 5, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.