Team India: టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?

Arrest Warrant Issued against Robin Uthappa: భారత జట్టు మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప భారత జట్టు తరపున మొత్తం 59 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే క్రికెట్‌లో 934 పరుగులు చేయగా, టీ20 క్రికెట్‌లో 249 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధశతకాలు సాధించాడు. ఇప్పుడు పదవీ విరమణ చేసిన రాబిన్ కొన్ని లీగ్‌లలో కనిపిస్తున్నాడు.

Team India: టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?
Robin Uthappa
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2024 | 10:44 AM

Arrest Warrant Issued against Robin Uthappa: టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఉద్యోగులను, ప్రభుత్వాన్ని మోసం చేసిన కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. రాబిన్ ఉతప్ప సెంచరీస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీని నడుపుతున్నాడు. ఈ కంపెనీలో పనిచేస్తున్న చాలా మందికి ఎఫ్‌ఐఎఫ్‌ చెల్లించకుండా మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

రాబిన్ ఉతప్పకు చెందిన కంపెనీ జీతంలో పీఎఫ్ సొమ్మును కట్ చేసినా.. ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సిన రూ. 23 లక్షలు జమ చేయలేదంట. దీంతో రాబిన్ ఉతప్ప కంపెనీ మోసం చేసిందంటూ ఆరోపించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పీఎఫ్‌వో ప్రాంతీయ కమిషనర్‌ షడక్షిరి గోపాల రెడ్డి రాబిన్‌ ఉతప్పను అరెస్ట్‌ చేయాలంటూ పులకేశి నగర్‌ పోలీసులకు ఈ నెల నాలుగో తేదీన లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో నోటీసు జారీ చేసేందుకు పోలీసులు రాబిన్ ఉతప్ప ఇంటికి వెళ్లారు. కానీ, ప్రస్తుతం అతను ఆ చిరునామాలో నివాసం ఉండడంలేదు. దీంతో ఇప్పుడు రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్‌ అమలులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రాబిన్ ఉతప్ప ఇండియాను వదిలి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు కావడంతో బెంగళూరు వచ్చే అవకాశం ఉంది.

టీమిండియా తరపున 46 వన్డేల్లో 42 ఇన్నింగ్స్‌లు ఆడిన రాబిన్ ఉతప్ప 6 అర్ధసెంచరీలతో మొత్తం 934 పరుగులు చేశాడు. అలాగే, అతను 13 T20 మ్యాచ్‌లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మరియు 12 ఇన్నింగ్స్‌లలో 249 పరుగులు చేశాడు. 2022లో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉతప్ప ఇప్పుడు తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో స్థిరపడ్డాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?
టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..