Rinku Singh Captain: కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్..!

Vijay Hazare Trophy: డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీకి రింకూ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా నియమించింది. భువనేశ్వర్ కుమార్ స్థానంలో రింకూ సింగ్‌ని తీసుకున్నారు. రింకూ సింగ్ తొలిసారిగా రాష్ట్ర జట్టుకు సారథ్యం వహిస్తున్నారు.

Rinku Singh Captain: కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్..!
Rinku Singh Captain
Follow us
Venkata Chari

|

Updated on: Dec 21, 2024 | 9:23 AM

Vijay Hazare Trophy: భారత దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి ఉత్తరప్రదేశ్ జట్టును ప్రకటించారు. డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి రింకూ సింగ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతను భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కాగా, జట్టు కెప్టెన్సీ రింకూ సింగ్‌కు దక్కింది. సీనియర్ స్థాయిలో రాష్ట్ర జట్టుకు రింకూ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. గతంలో యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ జట్టుకు రింకూ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.

తొలిసారిగా ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేసిన రింకూ సింగ్.. ‘యూపీ టీ20 లీగ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు గొప్ప అవకాశం. ఈ కాలంలో నేను చాలా నేర్చుకోగలిగాను. యూపీ టీ20 లీగ్‌లోనూ బౌలింగ్‌పై దృష్టిపెట్టాను. ఆధునిక క్రికెట్‌కు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయగల ఆటగాళ్లు అవసరం. కాబట్టి నా బౌలింగ్‌పై కూడా పనిచేశాను. నాయకుడిగా నా బాధ్యత పెరిగింది. దీనికి నేను సిద్ధంగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా..

ఇటీవల, కొన్ని మీడియా నివేదికలు రాబోయే ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీని కూడా రింకు సింగ్ దక్కించుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై రింకూ సింగ్ మాట్లాడుతూ, ‘ప్రస్తుతానికి, జట్టు కోసం విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడంపై మాత్రమే తన దృష్టి ఉంది. ఐపీఎల్‌లో కేకేఆర్ నాయకత్వం గురించి నేను పెద్దగా ఆలోచించను. ప్రస్తుతం నా దృష్టి అంతా ఉత్తరప్రదేశ్ జట్టుపైనే. విజయ్ హజారే ట్రోఫీని గెలవాలనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ రికార్డ్..

దేశవాళీ క్రికెట్‌లో రింకూ సింగ్ గణాంకాలు అత్యద్భుతంగా ఉన్నాయి. అతను 52 ఇన్నింగ్స్‌లలో 48.69 సగటు, 94.8 స్ట్రైక్ రేట్‌తో 1899 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను ఒక సెంచరీ, 17 అర్ధసెంచరీలు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..